తుక్కుగూడ బహిరంగ సభ జయప్రదం చేయండి.
మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాపా సుధాకర్.
అక్షర విజేత తల్లాడ:
శనివారం హైదరాబాద్ తుక్కుగూడ నందు జరిగే కాంగ్రెస్ పార్టీ జన జాతర బహిరంగ సభను విజయవంతం చేయాలని తల్లాడ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కాపా సుధాకర్ పిలుపునిచ్చారు. శనివారం జరిగే సభకు తల్లాడ నుంచి బస్సులు బయలుదేరుతాయని కావున కాంగ్రెస్ నాయకులు అభిమానులు కార్యకర్తలు తల్లాడ మండలం నుంచి అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు.