వ్యక్తిగత విమర్శలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు
* విశ్వాసం లేని వ్యక్తి రంజిత్ రెడ్డి
గుడ్లు, దాన, భూ కుంభకోణాలలో కూరుకున్న రంజిత్ రెడ్డి
* మాజీ ఎంఎల్ఏ కేఎస్ రత్నం, బిజెపి జిల్లా అధ్యక్షుడు మాధవ రెడ్డి
అక్షరవిజేత, వికారాబాద్ ప్రతినిధి
కొండా విశ్వేశ్వర్ రెడ్డి పై వ్యక్తిగత విమర్శలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని మాజీ ఎమ్మెల్యే కె.ఎస్.రత్నం పేర్కొన్నారు.గుడ్లు, దాన, భూ కుంభకోణాలలో కూరుకున్న వ్యక్తి చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఎంపి అభ్యర్థి రంజిత్ రెడ్డి అని మాజీ ఎంఎల్ఏ కేఎస్ రత్నం విమర్శించారు. గురువారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని నాగేష్ గుప్త గార్డెన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ ఎంఎల్ఏ కేఎస్ రత్నం మాట్లాడుతూ రంజిత్ రెడ్డి చేవెళ్ల పార్లమెంట్ నియోజక వర్గాన్ని అన్ని రంగాలలో వెనుకబడేశారని విమర్శించారు. బిజెపి చేవెళ్ల ఎంపి అభ్యర్థి కొండావిశ్వేశ్వర్ రెడ్డి నీతి నిజాయితీ పరుడని ఆయన కొనియాడారు. సిఎం ఎనుముల రేవంత్ రెడ్డి వ్యక్తి గతంగా మంచి వ్యక్తి అన్నారు. కానీ సిఎం కేసిఆర్ పాలనను గుర్తు చేస్తున్నారని గుర్తు చేశారు. విశ్వేశ్వరరెడ్డి అధికారంలో ఉన్న పార్టీలోకి ఎప్పుడూ చేరలేదని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే రంజిత్ రెడ్డిని ఓడించడానికి కంకణం కట్టుకున్నారని ఆయన స్పష్టం చేశారు. హనుమాన్ మందిరాన్ని కూల్చి అపార్ట్మెంట్ కట్టడం అవివేకానికి నిదర్శనమన్నారు. రేవంత్ రెడ్డి మంచివాడే కానీ కాంగ్రెస్ పార్టీ మంచిది కాదన్నారు. జిల్లా బిజెపి అధ్యక్షుడు కోకట్ మాధవరెడ్డి మాట్లాడుతూ ప్రజా ఆశీర్వాద యాత్ర దిగ్విజయంగా ముందుకు సాగుతుందన్నారు. ప్రజా ఆశీర్వాద యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ఆయన వెల్లడించారు. అప్ కీ బార్ 400 సీట్ ఆయేగా అనే నినాదంతో ప్రజా క్షేత్రంలో వెళ్తున్నామని తెలిపారు. పార్లమెంటు లో ప్రజా సమస్యల పరిష్కారానికి గళమిప్పిన వ్యక్తి కొండావిశ్వేశ్వర్ రెడ్డి అని కొనియాడారు. భారతీయ జనతాపార్టీ గడప తొక్కడానికి రంజిత్ రెడ్డి ప్రయత్నించలేదా అని ప్రశ్నించారు. మీడియా సమావేశంలో కోటిగారి శివరాజ్, వివేకానంద రెడ్డి, పాండుగౌడ్, కెపి రాజు, రామకృష్ణారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, రాజేందర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.