మొక్కజొన్న రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి
అక్షరవిజేత బయ్యారం
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వంమే చేప్పాట్టాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ,సహకార మంత్రి తుమ్మల నాగేశ్వరరావుని కలిసి ఇల్లందు శాసన సభ్యులు కోరం కనకయ్య ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో బయ్యారం సింగిల్ విండో చైర్మన్ మూల మాధుకర్ రెడ్డి మాట్లాడుతూ..మొక్క జొన్న రేట్లు రోజు రోజుకీ తగ్గిపోవడం వల్ల రైతాంగం నష్టపోకుండా ఉండటం కోసం మొక్క జొన్న కొనుగోలు వెంటనే ప్రభుత్వంమే చేప్పాట్టాలని వినతి పత్రం ఇవ్వడం జరిగిందని అన్నారు.ఈ కార్యక్రమంలో బయ్యారం సొసైటీ డైరెక్టర్ వేల్పుల శ్రీనివాస్,జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్య ప్రవీణ్ నాయక్,జగత్ రావు పేట ఎంపీటీసీ మోహన్ జీ,బయ్యారం మండల కాంగ్రెస్ నాయకులు ఏనుగుల రాకేష్ పాల్గొన్నారు.