అటవిశాఖ అధికారుల డప్పు చాటింపు
అక్షర విజేత అదిలాబాద్ ప్రతినిధి:-
కొమురంభీం జిల్లాలో ఏనుగు సంచారం గ్రామస్తులను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తుంది. గత 24 గంటలలో ఏనుగు దాడిలో ఇద్దరు మృత్యువాత పడ్డారు దీంతో గురువారం బెజ్జూర్ మండలం ముంజంపల్లి గ్రామంతో పాటు పలు గ్రామాలలో అటవిశాఖ అధికారులు డప్పు చాటింపు వేయించారు. గ్రామస్తులు ఎవరూ బయటకు రాకూడదని పొలం పనులకు వెళ్ళకూడదని ఒంటరిగా బయటకు రాకూడదని డప్పు చాటింపు వేశారు కార్యక్రమంలో అటవిశాఖ అధికారులు గ్రామస్తులు ఉన్నారు