తెలంగాణ మహిళా డిగ్రీ కళాశాల మర్కల్ నందు వృక్ష శాస్త్ర అధ్యాపకురాలు ఎమ్. కీర్తి కి పి హెచ్ డి . పట్టా :
అక్షర విజేత కామారెడ్డి బ్యూరో
కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండల్ మర్కల్ గ్రామం నం బీదు ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల నందుఉస్మానియా విశ్వవిద్యాలయం సైన్సు కళాశాల బోటని విభాగంలో ప్రొఫెసర్ .ఎ. సబితా రాణి పర్యవేక్షణలో ‘ఇన్విట్రో కల్చర్ అండ్ పైటో కెమికల్ ప్రొఫైలింగ్ ఆఫ్ ఓపర్క్యూలిన టార్పెతం (ఎల్) సిల్వ మాన్ సో అనే అంశంపై మైలారం కీర్తి తన పరిశోధన గ్రంథాన్ని సమర్పించడంతో ఓయూ డాక్టరేట్ ప్రధానం చేశారు. ఈ మేరకు ఓయూ పరీక్షల విభాగం వారు ఒక ప్రకటన విడుదల చేశారు. డా. కీర్తి ప్రస్తుతం కామారెడ్డి లో గల తెలంగాణ స్టేట్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కళశాలలో బోటని లెక్చరర్ గా పనిచేస్తున్నారు. విజయవంతంగా పరిశోధన పూర్తి చేసుకొని పి. హెచ్. డి. పట్టా సాధించినందుకు గాను ఆమెను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వి. రాధిక, వైస్ ప్రిన్సిపల్ వి. రేణుక, అకాడమిక్ కో ఆర్డినేటర్ కే. వనజ తో పాటు కళాశాల అధ్యాపక బృందం అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.