బూత్ కన్వీనర్ల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే వసంత కి ఘన స్వాగతం పలికిన తెదేపా కార్యకర్తలు
అక్షరవిజేత,మైలవరం :
మైలవరం పట్టణంలోని సీఎంఆర్ కళ్యాణమండపంలో సోమవారం సాయంత్రం నిర్వహించిన సమావేశంలో బిజెపి, జనసేన పార్టీలు బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వసంత వెంకట కృష్ణప్రసాదు పాల్గొన్నారు. ముందుగా ఎన్టీఆర్ పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే వసంత కి ఘన స్వాగతం లభించింది. తెదేపా నాయకులు ఆయనే ఘనంగా స్వాగతించి, అక్కున చేర్చుకున్నారు.ఈ సమావేశంలో జనసేన పార్టీ మైలవరం నియోజకవర్గ ఇన్చార్జ్ అక్కల రామ్మోహనరావు (గాంధీ) జనసేన నాయకులు కూడా పాల్గొన్నారు. అక్కల గాంధీ ని ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు సాదరంగా ఆహ్వానించారు. వసంత కృష్ణ ప్రసాద్ వారి కి కృతజ్ఞతలు తెలిపారు.బూత్ కమిటీల ప్రతినిధులు, తెలుగుదేశం నాయకులతో సభా ప్రాంగణం కిక్కిరిసి పోయింది. తమ ప్రియతమ వసంత కృష్ణ ప్రసాదు పై వెలకట్టలేని అభిమానాన్ని చూపుతూ తెదేపా నాయకులు, జనసేన నాయకులు,హర్షం వ్యక్తం చేశారు.