
అక్షర విజేత, మంచిర్యాల ప్రతినిధి
తమకు ఇండ్లు నిర్మించుకోవడానికి 2007వ సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన భూమిని అక్రమంగా పట్టా చేసుకొని తమను ఇబ్బందులకు గురి చేస్తున్న వ్యక్తిపై కఠినమైన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరుతూ ఆదే శ్రీనివాస్ అనే బాధితుడు తహసీల్దార్ కార్యాలయం ఎదుట పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే తాండూరు మండలం రెచిని గ్రామ పంచాయతీపరిధిలోని బారేపల్లి గ్రామంలో 2007 సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ప్రభుత్వం ఇండ్ల స్థలాలు ఇవ్వాలని భూ సేకరణ చేసింది. సర్వే నెంబర్ 41/ఆ లో సుబ్బ దత్తుమూర్తి కి చెందిన ఒక ఎకరం 17గుంటలు, సర్వే నంబర్ 45/ఆ లో లక్ష్మి అనే మహిళాకు చెందిన ఒక ఎకరం 25 గుంటల భూమిని సేకరించి వారికీ నష్టపరిహారం కూడా ఇవ్వడం జరిగింది. అట్టి భూమిని రెవెన్యూ అధికారులు లే అవుట్ చేసి 60 మందికి ప్లాట్ లు కేటాయించడం జరిగింది. అయితే నిరుపేదలైన లబ్ధిదారులు నిర్మాణం చేయకపోవడంతో అదే అదునుగా భావించి అధికారులను ప్రలోభాలకు గురి చేసి ధరణి పోర్టల్ లో తన పేరున పట్టా చేసుకుని రైతు బందు, క్రాఫ్ లోన్ కూడా తీసుకుంటూ అధికార దుర్వినియోగం చేసాడని ఆందోళన చేపట్టారు. మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సింగిల్ విండో చైర్మన్ సుబ్బ దత్తు మూర్తి కబ్జా చేసి తన భూమి అని గ్రామస్తుల పై దౌర్జన్యం చేసాడని దత్తు మూర్తి దిష్టి బొమ్మతో రెచిని గ్రామపంచాయతీ నుండి గ్రామ చివరి వరకు ర్యాలీ నిర్వహించి దహనం చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయనికి వెళ్లి తహసీల్దార్ కు వినతిపత్రం అందజేశారు. తహిసిల్దర్ కార్యాలయం ఎదుట తమ భూమి తనకు ఇప్పించాలని శ్రీనివాస్ అనే బాధితుడు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు శ్రీనివాస్ ను ఆసుపత్రికి తరలించారు.