రాజ్యాంగ రక్షణ యాత్రను విజయవంతం చేయండి జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్
అక్షరవిజేత మంథని ;
మహనీయుల మహోత్సవంలో భాగంగా ఏప్రిల్ 2 నుండి 8 వరకు జాతీయ మాల మహానాడు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రాజ్యాంగ రక్షణ యాత్ర తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలు తిరుగుతూ ఈరోజు పెద్దపల్లి జిల్లా మంథని చేరుకోవడం జరిగింది ఈ యాత్రకు మంథని మాల మహానాడు నాయకులు ఘన స్వాగతం పలికారు మంథనిలోని చాకలి ఐలమ్మ విగ్రహం నుండి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించి రాజ్యాంగ రక్షణ యాత్రను ప్రారంభించారు అంబేద్కర్ గారికిపూల మాలవేసి అనంతరం జాతీయ మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ మాట్లాడుతూ న్యాయం, స్వేచ్ఛ,సమానత్వం, సౌబ్రతత్వాలు మూల స్తంభాలుగా మన భారత రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందిస్తే నేడు కేంద్ర ప్రభుత్వ పాలనలో రాజ్యాంగంలోని మౌనిక సూత్రాల పునాదులు ధ్వంసం అవుతున్నాయని జీవించే హక్కు,మాట్లాడే స్వేచ్ఛ కోల్పోతున్నామని అన్నారు. బిజెపి ప్రభుత్వం కార్పొరేట్ ఆర్థిక విధానాల దుష్ఫలితాల వల్ల పేద ధనిక వర్గాల మధ్య రోజు రోజుకి దూరం పెరుగుతుంది అన్నారు.జాతీయవాదం పేరుతో దళిత మైనార్టీ వర్గాలపై జరిగిన దాడుల నుండి మణిపూర్ లో గిరిజన మహిళల ను వివస్త్ర ను చేసిన సంఘటన వరకు రాజ్యాంగ హక్కులను కేంద్రం కాలరాస్తుందని అన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితో ప్రశ్నించేటువంటి గొంతులను అణచివేస్తూ ప్రశ్నించిన వారిని ఈడి, సిబిఐ, పేరిట కుట్ర కేసులు పెడుతుంది అలాగే 400 సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మారుస్తామనేవరకు తెగించారు అని అన్నారు.
అందుకే ప్రజలు ప్రజాస్వామిక వాదులు బుద్ధి జీవులు అందరూ రాజకీయాలకతీతంగా మద్దతు తెలిపి రాజ్యాంగ రక్షణలో భాగస్వాములు కావాలని మరియు ఏప్రిల్ 8న హైదరాబాదులో జరిగే ముగింపు రాజ్యాంగ రక్షణ యాత్ర సదస్సుకు పెద్ద ఎత్తున తరలిరావాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు నూకల బానయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు అప్పాల పోచ మల్లయ్య, డివిజన్ అధ్యక్షుడు ఎరుకల రమేష్ బాబు, మంథని మండల అధ్యక్షుడు జంజర్ల రాజు, సోషల్ మీడియా ఇంచార్జ్ గొర్రెoకల సురేష్ మాల మహానాడు నాయకులు, తదితరులు పాల్గొన్నారు.