సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి. కేకును కట్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించిన . ఇంటూరి విజయ్ నాథ్ కుటుంబ సభ్యులు
ఎవరి ఆకలి తీర్చిన.. బాబా కడుపు నిండినట్టే..
—అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది.* అన్నం పరాబ్రహ్మ సర్వరూపం.
అక్షర విజేత కామారెడ్డి బ్యూరో
నసురుల్లాబాద్ మండల పరిధిలో నాచుపల్లి గ్రామానికి చెందిన ఇంటూరి విజయ్ నాథ్ కుటుంబ సభ్యులుతో గురువారము నెమలి గ్రామం సాయిబాబా ఆలయంలో కుటుంబ సభ్యులతో ప్రత్యేక పూజలు నిర్వహించి కేకులు కట్ చేసి హారతి అష్టోత్తర కార్యక్రమం నిర్వహించారు . మధ్యాహ్నం ఒంటిగంటకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. విజయనాథ్ రావు మాట్లాడుతూ అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది అన్నారు అన్నం పరాబ్రహ్మ సర్వరూపమన్నారు. ప్రతి ఒక్కరు భక్తి భావాన్ని అలవర్చుకోవాలని సూచించారు. ప్రతి గురువారము సాయిబాబా సన్నిధిలో అన్నదాన కార్యక్రమం నిర్వహించేవారు . 5000 రూపాయలు కమిటీ వారి చెల్లిస్తే వారి పేరు మీద అన్నదానం జరుపబడుతుందని అన్నారు .ఈ కార్యక్రమంలో సాయిబాబా ఆలయ కమిటీ సభ్యులు ఇంటూరి విజయ్నాథ్ ఇంటూరి కృష్ణ ప్రసాద్ కాజా వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.*