జిల్లాలో తాగునీటి సమస్య రాకుండా పరిష్కరించండి.
ఎండ తీవ్రత దృశ్య ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్
అక్షర విజేత వనపర్తి ప్రతినిధి.
వనపర్తి జిల్లాలో ఏ ఒక్క గ్రామంలో తాగు నీటి సమస్య రాకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ ఆదేశించారు.
తాగు నీటి సమస్య, ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం, పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, వడగాల్పులు నుండి రక్షణ పై సోమవారం మధ్యాహ్నం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతకుమారి జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంబంధిత జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వార సమీక్ష నిర్వహించగా జిల్లా కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
జిల్లాలలో తాగు నీటి సమస్య తలెత్తకుండా ప్రతి ఇంటికి సరిపడా తాగు నీటిని అందించేందుకు అన్ని ముందస్తు చర్యలు తీసుకోవడంతో పాటు అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ ను బాధ్యతలు అప్పగించాలని సూచించారు. మండల స్థాయిలో ప్రత్యేక అధికారులు, గ్రామస్థాయి ప్రత్యేక అధికారులు, పంచాయతీ సెక్రటరీ లకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని ప్రధాన కార్యదర్శి ఆదేశించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ ఇప్పటికే సూక్ష్మ ప్రణాళిక రూపొందించి గ్రామం వారీగా చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
జిల్లాలో మిషన్ భగీరథ నీళ్ళు సరిపడా ఉన్నాయని అయినప్పటికీ ని వాటిని సరైన ప్రణాళిక ప్రకారం సరఫరా చేసేవిధంగా అధికారులను ఆదేశించారు. ప్రత్యామ్నాయంగా అన్ని చేతి పంపులు మరమ్మతు చేయించడమే కాకుండా అవసరమైతే వ్యవసాయ బోర్లను లీజు కు తీసుకొని తాగునీరు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. మండల, గ్రామ స్థాయి ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ సమస్యలు తెలుసుకొని ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
వరి కొను కేంద్రాల ఏర్పాటు పై మాట్లాడుతూ రానున్న మూడు రోజుల్లో అన్ని మౌలిక సౌకర్యాలతో అన్ని కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కావాలని ఆదేశించారు . చలువ నీడ, తాగు నీరు తో పాటు కొనుగోలుకు సంబంధించి అవసరమైన అన్ని పరికరాలు ఉండాలని, కనీస మద్దతు ధర తెలిపే ఫ్లెక్సీలు , రైతులకు సమస్యలు ఏమైనా వస్తె వెంటనే ఫోన్ చేసేందుకు సంబంధిత అధికారుల ఫోన్ నెంబర్లతో కూడిన ఫ్లెక్సీ ప్రతి కొనుగోలు కేంద్రంలో ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించారు.
అన్ని రైస్ మిల్లులు 24 గంటలు నడవాలని జిల్లా నుండి ఇవ్వాల్సిన ధాన్యం ప్రతిరోజూ ఎఫ్.సి ఐ. కి పంపించేవిధంగా చూడాలని సూచించారు. బాయోల్డ్ రైస్ మిల్లులు అన్ని పనిచేసి బియ్యం ఇచ్చేవిధంగా చూడాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ ను సూచించారు.
పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు రిపేర్లు, నిర్వహణను పరిశీలించి ఇంజనీరింగ్ అధికారుల ద్వారా పనుల అంచనాలు సిద్ధం చేసి జూన్ 10 లోగా మరమ్మతులు పూర్తి అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. మండల స్థాయి సమావేశం నిర్వహించి పాఠశాలల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటుకు తీసుకోవాల్సిన చర్యల పై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయాలన్నారు.
వడదెబ్బ నుండి రక్షణకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక*
ఏప్రిల్, మే నెలల్లో ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉన్నందున జిల్లాలో ఏ ఒక్కరూ వడదెబ్బకు గురి కాకుండా కార్యాచరణ చేపట్టాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారినీ ఆదేశించారు.
అన్ని ప్రాథమిక కేంద్రాల్లో వడదెబ్బకు వెంటనే చికిత్స అందించే విధంగా సిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రతి ఆశ కార్యకర్త వద్ద అవసరమైన మేరకు ఒ ఆర్.ఎస్ ప్యాకెట్లు ఉండాలని అవసరమైన వారికి వెంటనే ఇచ్చేవిథంగా చూడాలన్నారు.
ఉపాధి హామీ కూలీలు ఉదయాన్నే వెళ్లి 12 గంటల వరకు తిరిగి వచ్చేసేవిధంగా చూడాలని డి.ఆర్.డి. ఒ ను ఆదేశించారు. పనిచేసే చోట చలువ నీడ, తాగునీరు, ఒ.ఆర్.ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు.
ప్రజలు సైతం మధ్యాహ్నం 12 నుండి 4 గంటల వరకు బయటికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంచినీరు తాగుతూ ఉండాలని కోరారు. కలుషిత నీరు కానీ ఐస్ తో కుడిన కూల్ డ్రింక్ లు జ్యూస్ లు తాగవద్దని సూచించారు. ఏమాత్రం వడదెబ్బ తగిలినట్లు అనిపిస్తే వెంటనే ఒ ఆర్.ఎస్ తాగడం వైద్యం చేయించుకోవాలి అని తెలిపారు. వడదెబ్బకు తీసుకోవాల్సిన చర్యల పై రూపొందించిన గోడ పత్రిక ను అధికారులతో కలిసి ఆవిష్కరించారు.
వడదెబ్బ, కొనుగోలు కేంద్రాలు, తాగు నీటి తదితర సమస్యల పై ఫిర్యాదుల కొరకు కలెక్టరేట్ లో కంట్రోల్ రూం ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు.
కంట్రోల్ రూమ్ నెంబర్ 08545-220353, 220351 .
అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత గంగ్వార్, అదనపు కలెక్టర్ రెవెన్యూ యం. నగేష్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.