సింగరేణి ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు…
అక్షర విజేత ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో:
బెల్లంపల్లి ఏరియాలోని సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ యువకులకు స్కిల్ డెవలప్మెంట్ కోర్సులపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందని పర్సనల్ మేనేజర్ రెడ్డిమల్ల తిరుపతి తెలిపారు. గతంలో ఇచ్చిన దరఖాస్తు గడువును ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించా రన్నారు. సింగరేణి ప్రాంత యువతీ యువకులు ఈ స్కిల్ డెవలప్మెంట్ ఉచిత శిక్షణ శిబిరానికి అర్హులు. మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రైన్షిప్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరియు రీజినల్ డైరెక్టర్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రైన్షిప్ తెలంగాణ స్టేట్ సహకారంతో మొత్తం సుమారు 38 వృత్తి శిక్షణ కోర్సులలో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది.
వృత్తి శిక్షణ కోర్సులలో భాగంగా కాస్మటాలజీ, డ్రోన్ టెక్నాలజీ, సోలార్ టెక్నీషియన్, సెల్ ఫోన్ టెక్నీషియన్, టూ వీలర్ మెకానిక్, ఆర్క్ అండ్ గ్యాస్ వెల్డింగ్, కంప్యూటర్ అండ్ డిటిపి, ఎల్.ఎం.వి డ్రైవింగ్ ,ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ తదితర కోర్సులపై శిక్షణ ఉంటుంది.
కాస్మటాలజీ కోర్సు కు పదవ తరగతి లేదా ఎటువంటి విద్యార్హతలు లేకపోయినా దరఖాస్తు చేసుకోవచ్చు
ఇతర కోర్సులకు సంబంధిత విద్యార్హత కలిగి ఉండాలి
ఒక్కొక్క బ్యాచ్ కు 20 మంది
ఆసక్తి గల యువతీ యువకులు ఆన్లైన్ వెబ్ సైట్ ద్వారా www.scclmines.com/apprenticeshipలో 15.04.2024 లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. బెల్లంపల్లి ఏరియా అభ్యర్థులు గోలేటిలోని ఎంవీటీసీ వృత్తి శిక్షణ కేంద్రంలో సంబంధిత అప్లికేషన్ మరియు సర్టిఫికెట్స్ తో దరఖాస్తు ఫారంని అందజేయాలని తెలిపారు