దౌర్జన్యంగా మహిళను కొట్టిన కేసులో ఆరు నెలలు శిక్ష
అక్షర విద్యుత్ సిద్దిపేట
తన కూతురుపై గ్యార వెంకటమ్మ గ్యార శ్రీనివాస్ రెడ్డి ఇరువురు పాత కక్షల దృష్టిలో పెట్టుకొని అక్రమంగా ఇంటిలోకి ప్రవేశించి .అసభ్య పదజాలం ఉపయోగిస్తూ చెప్పులతో కొట్టడం జరిగిందని. రమ్య తల్లి అయిన చంద్రకళ 20 జనవరి 2016లో ఫిర్యాదు చేయడం జరిగింది అనంతరం అప్పటి ఎస్సై రాజేంద్ర ప్రసాద్ కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించి. పై నేరస్థులు ఇద్దరిని అరెస్టు చేసి జుడిషియల్ రిమాండ్ కు పంపించడం జరిగింది. విచారణ పూర్తి చేసి కోర్టులో చార్జి సీటు వేయడం జరిగింది ఆరోజు నుండి ఏప్రిల్ 4 వరకు ప్రిన్సిపాల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో కేసు విచారణ జరిగింది జడ్జి గారి ఇరువురి వాదనలు విన్న తర్వాత పై నేరస్తులు ఇరువురిపై నేరము రుజువైనందున 6 నెలల జైలు శిక్ష రెండువేల రూపాయలు జరిమానా విధించడం జరిగింది.