సరైన పత్రాలు లేని రూపాయలను సీజ్ చేయడం జరుగుతుంది.
డబ్బుతో పాటు సరైన పత్రాలను దగ్గరలో ఉంచుకోవాలి
జిల్లా ఎస్పీ రితిరాజ్
అక్షర విజేత జోగులాంబ గద్వాల ప్రతినిధి
చెక్ పోస్టుల దగ్గర వాహనాల తనిఖీల్లో ఏలాంటి రశీదులు లేని 11,54,200/- రూపాయలు పోలీసులు సీజ్ చేశారు.లోక్ సభ ఎన్నికల కోడ్ లో బాగంగా జిల్లా సరి హద్దు చెక్ పోస్టు లలో విస్తృతంగా పోలీసులు వాహనాల తనిఖీలు చేపడుతున్నట్లు జిల్లా ఎస్పీ రితిరాజ్ తెలిపారు.మంగళవారం ఉండవల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పుల్లురు చెక్ పోస్టు దగ్గర పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో ఎలాంటి రశీదులు లేని 11లక్షల రూపాయలు, కేటి దొడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో నందిన్నే చెక్ పోస్టు దగ్గర జరిపిన వాహన తనిఖీల్లో 54 వేల 2 వందల రూపాయలు సీజ్ చేయడం జరిగిందని వీటిని పంచనామా అనంతరం జిల్లా ఎన్నికల గ్రీవెన్స్ రిడ్రెసెల్ కమిటీకి అప్పగించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ రితిరాజ్ తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున జోగుళాంబ గద్వాల్ జిల్లా పరిధిలో ఎవరైన 50 వేల రూపాయలకు మించి ఎక్కువ డబ్బులను తీసుకువెళ్లరాదని ఒక వేళ తీసుకెళ్తే తగిన రశీదులు ,పత్రాలు వాటి వివరాలు వెంట తీసుకెళ్ళాలని జిల్లా ఎస్పీ ప్రజలకు సూచించారు.