చిగురుమామిడి లో గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి
అక్షర విజేత: చిగురుమామిడి
బహుజన వర్గాల రాజ్యాన్ని స్థాపించడం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మహనీయుడు సర్దార్ పాపన్న గౌడ్ అని చిగురుమామిడి మండల గౌడ సంఘం నాయకులు అన్నారు. మంగళవారం చిగురుమామిడి మండల గౌడ సంఘం అధ్యక్షుడు బొమ్మగాని వెంకటేశం గౌడ్ ఆధ్వర్యంలో సర్వాయి పాపన్న గౌడ్ 314వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.పాపన్న విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ సర్వాయి పాపన్న గౌడ్ జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని, ఆయన ఆశయాన్ని కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు బుర్ర తిరుపతి గౌడ్, కొండ కనకయ్య గౌడ్, ముల్కనూరు గ్రామ అధ్యక్షుడు చంద్రయ్య గౌడ్, పుధరి వేణు గౌడ్, బుడిగే పరశురాములు గౌడ్, గట్టు బుచ్చయ్య గౌడ్, బండారుపల్లి తిరుపతి గౌడ్, శ్రీనివాస్ గౌడ్, రాయ మల్లు గౌడ్, అరవింద్ గౌడ్, పరకాల కొండయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.