ఉదార స్వభావాన్ని చాటుకున్న శంకరమ్మ సేవాదళ్ ట్రస్ట్
అక్షర విజేత అలంపూర్
ఎర్రవల్లి మండల పరిధిలోని షేకుపల్లి గ్రామంలో మున్నూరుకాపు
సామాజిక వర్గానికి చెందిన గద్వాల రాముడు అనారోగ్య కారణాలు రీత్యా మృతి చెందడం జరిగింది. ఈ సందర్భంగా ఎర్రవల్లి మండలం కొండేరు గ్రామం పోతురాజు శంకరమ్మ సేవాదళం ట్రస్ట్ చైర్మన్ పోతురాజ్ సోమనాద్రి బుధవారం షేక్ పల్లి గ్రామానికి వెళ్లి రాముడు భౌతిక దేహానికి పూలమాలలు వేసి కుటుంబ సభ్యులను ఓదార్చి ఆ కుటుంబానికి 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.ఆయనతోపాటు కాంగ్రెస్ నాయకులు యువరాజ్, రామ్ రెడ్డి, జాకీర్, ఎల్కూరు హనుమంతు పాల్గొన్నారు