ఇందిరానగర్ లో రోడ్డు ప్రమాదం….
అక్షర విజేత అదిలాబాద్ ప్రతినిధి:-
కొమురం భీం జిల్లా రెబ్బెన మండలం ఇందిరానగర్ గ్రామం వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మంచిర్యాలకు చెందిన గోళం సాయి కిరణ్ 28 వడ్లూరి గణపతి మృతి చెందారు బిఎస్ఎన్ఎల్ సైట్ ఇంజనీర్ గా విధులు నిర్వహిస్తున్న సాయికిరణ్ విధులు ముగించుకొని మంచిర్యాల వైపు వెళుతున్నాడు. వడ్లూరి గణపతి ఇందిరానగర్ వద్ద రోడ్డు దాటుతుండగా ద్విచక్ర వాహనం ఢీకొనడంతో చికిత్స పొందుతూ మృతి చెందారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు