పొంగులేటి ప్రసాద్ రెడ్డి ముమ్మర పర్యటన
అక్షరవిజేత,నేలకొండపల్లి :
కాంగ్రెస్ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి గురువారం ముమ్మరంగా పర్యటించారు. ఖమ్మం జూబ్లీక్లబ్ ఫంక్షన్ హాల్ లో వేమి శెట్టి నరేష్ కుమార్తె ఓణీ అలంకరణ వేడుకకు హాజరై దీవించారు. జిల్లా కోర్టు సమీపంలో కార్పొరేటర్ సరిపూడి సతీష్, అల్లీ పురంలో రావూరి సైదుబాబు నూతన గృహప్రవేశాలకు ప్రసాద్ రెడ్డి హాజరై.. శుభాకాంక్షలు తెలిపారు. అల్లీపురంలోనే మధ్యాహ్న భోజనం చేశారు. తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు వద్ధ నూతనంగా ఏర్పాటు చేసిన సాయి మదీన పెట్రోల్ బంకును ప్రాంభించారు. ఖమ్మం రూరల్ మండలం బారుగూడెం లో కంట మహేశ్వరాలయంలో యంత్ర విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.గోళ్లపాడు లో కూడా స్వామివారి విగ్రహ ప్రతిష్ట వేడుకకు హాజరయ్యారు.ఇంకా గూడూరు పాడు, జాన్ బాధ్ తండా ల్లో వివాహ వేడుకలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పొంగులేటి అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు