గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడులు
అక్షర విజేత మరిపెడ:-
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం బోవోజి తండాలోని గుడుంబా స్థావరాలపై సోమవారం పోలీసుల దాడులు నిర్వహించారు. 1500 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసి 20 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. పలువురు వ్యక్తుల పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సంతోష్ తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో గుడుంబా ఏరులై పారుతుంది. రాత్రికి రాత్రి నల్లబెల్లం దిగుమతి అవుతుందని ప్రజలు గుసగుసలాడుతున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు గుడుంబా స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు. ఈ దాడుల్లో పిసి క్రాంతి పాల్గొన్నారు.