శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించడానికి పోలీస్ కవాతు: ఎస్సై మురళి
అక్షర విజేత మరికల్/ధన్వాడ
జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ ఆదేశాల మేరకు పార్లమెంట్ ఎన్నికలలోఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుత వాతావరణంలో నిర్వహించడానికి పోలీస్ కవాతు నిర్వహించడం జరుగుతుందని మరికల్ ఎస్సై మురళి తెలిపారు.
మరికల్ మండలంలోని సమస్యాత్మక గ్రామాలైన పసుపుల, ఎలిగండ్ల గ్రామాలలో ఎస్సై మురళి ఆధ్వర్యంలో కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు, పోలీసులు సోమవారం సాయంత్రం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ… పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ప్రజలు ధైర్యంగా, స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ప్రజలకు భద్రతా, భరోసా కల్పించేందుకు కేంద్ర సాయిధ పోలీస్ బలగాలచే ప్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగిందని ఎస్సై తెలిపారు. పార్లమెంట్ ఎలక్షన్స్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎస్సై తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, ఐటీబీపీ కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు తదితరులు పాల్గొన్నారు.