ఓటర్ల అపద్రత పోవడానికే పోలీస్ కవాతు: ప్రభాకర్ రావు అడిషనల్ ఎస్పీ
రాబోయే లోక్ సభ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి
ప్రధాన మందిరాలలో విద్యాసంస్థలలో ఎలాంటి ఎన్నికల ప్రచారాలు చేయరాదు
ప్రతిఒక్కరు తమ ఓటు హక్కు ను వినియోగించుకోవాలి
మద్యంకు డబ్బు ప్రలోభాలకు గురికావద్దు
ఎన్నికల కు సంబంచిన పిర్యాదుల కొరకు టోల్ ఫ్రి నంబర్ 1950 కు కానీ సి విజిల్ అప్ లో కానీ పిర్యాదు చేయగలరు
అక్షర విజేత అదిలాబాద్ ప్రతినిధి:-
మన తెలంగాణలో మే 13 తేదీన జరగబోయే లోక్ సభ ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి అల్లర్లు లేకుండా జరుపుకోవాలని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి ఎలాంటి మద్యం డబ్బుకు బహుమతుల ప్రలోభాలకు గురికావదని, ప్రార్థన మందిరాలలో కానీ విద్యాసంస్థలలో కానీ ఎలాంటి ప్రచారాలు చేయరాదు అని ఏమైనా ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదుల కొరకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు మరియు సి విజిల్ అప్లికేషన్లో ఫిర్యాదులు చేయొచ్చని ఆసిఫాబాద్ జిల్లా అడిషనల్ ఎస్పీ ప్రభాకర్ రావు పేర్కొన్నారు
ఈరోజు ఉదయం 6 గంటలకు ఆసిఫాబాద్ మండలంలోని రౌటసంకేపల్లి అడ్డగట్ గ్రామాలలో సిఐ సతీష్ మరియు సిఆర్పిఎఫ్ ఇన్స్పెక్టర్ బద్రిప్రసాద్ ఎస్సైలు రాజేశ్వర్ ప్రవీణ్ మరియు సిఆర్పిఎఫ్ కేంద్ర బలగాలతో సందర్శించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయ లోక్ సభ ఎన్నికను ప్రశాంత వాతావరణం లో జరుపుకోవాలి అని, ఎలాంటి అవాంఛనీయమైనా సంఘటలకు జరగకుండా ఉండాలి అని అన్నారు. ప్రతిఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి, డబ్బు మద్యం లాంటి ప్రలోభాలకు గురికావద్దు అని పేర్కొన్నారు దేవాలయాలు, మజీద్ లు, చర్చి లు విద్యాసంస్థలు మరియు ప్రభుత్వ కార్యాలయలో ఎలాంటి ఎన్నికల ప్రచారాలు నిర్వహించరాదు అని తెలిపినారు. అదేవిధంగా ఎదైన ఎన్నికల పిర్యాదు ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 1950 ఫోన్ చేసి కానీ, సి విజిల్ ఆప్ లో కానీ పిర్యాదు లు చేయవచ్చు అని చెప్పారు.
అనంతరం అడిషనల్ ఎస్పీ ప్రభాకర్ రావు గారు మరియు డీఎస్పీ సదయ్య గారి అద్వైర్యం లో ఆసిఫాబాద్ మండలం లోని ఎదులవాడ గ్రామంలో ఆసిఫాబాద్ సిఐ సతీష్ , సీఆర్పీఎఫ్ ఏసీ రాకేష్, ఇన్స్పెక్టర్ బద్రిప్రసాద్ , ఎస్సైలు ప్రవీణ్,రాజేశ్వర్ మరియు 40 మంది సీఆర్పీఎఫ్ కేంద్ర బలగాలు, స్థానికి పోలీసు లతో కలిసి కవాతు నిర్వహించి ప్రజలకు మేమున్నాం అనే ధైర్యంను, భరోస ను కల్పించారు