బిజెపి, బిఆర్ఎస్ హయాంలో ప్రజలకు ఓరింగిందేమి లేదు
—ఎన్ఎస్ఎఫ్ ఫ్యాక్టరీలను త్వరలో తెరిపిస్తాం
—పసుపు బోర్డు ఎక్కడ?
—కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి
అక్షర విజేత, నిజామాబాద్ ప్రతినిధి
బిజెపి, బిఆర్ఎస్ హయాంలో ప్రజలకు ఓరింగిందేమి లేదని నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు. పదేపదే పసుపు బోర్డుపై మాట్లాడుతున్న ఎంపీ అరవింద్ పసుపు బోర్డు అసలు హైదరాబాద్ లోనా, నిజామాబాద్ లో ఏర్పాటు చేస్తావా పసుపు బోర్డు ఎక్కడ అని ఆయన ప్రశ్నించారు. మంగళవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ జిల్లా పార్టీ కార్యాల యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ పసుపు బోర్డుకు జీవో ఇచ్చి నాలుగు నెలలు గడుస్తున్నా, ఇప్పటి వరకు ఎక్కడ బోర్డును ఏర్పాటు చేస్తున్నారో, విదివిధానాలు ఏమిటో తెలియజేలేదన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో బిజెపి, బిఆర్ఎస్ పది సంవత్సరాల పాలనలో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేదని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. జిల్లాలో పసుపు దిగుబడి తగ్గడం తోనే పసుపు ధర పెరిగిందని, ఇందులో బిజెపి కృషి ఏమీ లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసి కార్పోరేట్ సంస్థలకు దారాదత్తం ద్వజ మెత్తారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే తాను భారీ మెజారిటీతో గెలుస్తానని నమ్మకం కలిగిందని కాంగ్రెస్ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు. ఎన్నికల హామీలు నెరవేర్చలేని బిజెపి ప్రభుత్వమని తెలిపారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్లోగలు ఇస్తామని ఇవ్వలేదన్నారు. మా పార్టీ జాతీయ పార్టీ అని, ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చడంలో పూర్తిగా బిఆర్ఎస్ వైఫల్యం చెందటంతోనే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని అన్నారు. బిజెపి పార్టీ సైతం నిరుద్యోగులకు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగ అవకాశాలు ఇస్తామని చెప్పి, ఇవ్వకపోవడం దారుణం అన్నారు. బిజెపి ప్రభుత్వం అంటే వ్యాపార సంస్థగా మారిందనీ ఆరోపించారు. విదేశాల్లో ములుగుతున్న నల్లధనం తెచ్చి, ప్రతి పేదవాడి బ్యాంకు ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తామని చెప్పిన బీజేపీ అగ్రనాయకుల మాటాలు నీటి ముటలుగా మారాయని, ఇప్పటి వరకు ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. పెద్ద నొట్ల రద్దుతో నల్ల డబ్బు కాస్త తెల్ల డబ్బుగా మారిందని, కానీ ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. కేంద్రంలో రెండు సార్లు అధికారంలోకి వచ్చిన ఎన్.డి.ఏ దేశ రాజధా నిలో రైతులు నిరసనలు చేసిన పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. రైతులకు పంట రుణాలు మాఫి చేస్తే సోమరులు అవుతారు అన్న ప్రభుత్వాన్ని అడుగుతున్నాం అదాని, అంబానీలకు లక్షల కోట్ల రూపాయలు ఋణాలు ఇస్తే సోమరులు కారా అని ఆయన ప్రశ్నించారు. జాతీయ స్థాయిలో ఇండియా కుటమీ అధికారంలోకి వస్తే వ్యవసాయ రంగాన్ని మద్దతు ధర కల్పించి చట్ట బద్దత తేవడమే కాకుండా బోనస్ రూ.500 లను రైతులకు అందిస్తామన్నారు. వ్యవసాయ, వ్యసాయేతర ఆదాయాన్ని పొందేలా చూడాలని అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఉన్నపుడు ఇన్సూరెన్స్ కట్టి ఉంటే ఈ రోజు రైతులకు ఎలాంటి నష్టం జరగకపోతుండేదని అన్నారు. రైతుకు చెల్లించే భీమాను కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించనున్నదని అన్నారు. రైతులు చెల్లించాల్సిన రుణాలను రైతులు చెల్లించడం అవసరం లేకుండా రానున్న రబిలోపు బదలాయింపు చేసుకొని బ్యాంక్ లతో సంప్రదింపులు చేపడుతున్నామని అన్నారు. దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఏకా కాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. గతంలో యూపీఏ ప్రభుత్వం లక్ష రూపాయల రుణమాఫీ చేసిందని, ప్రస్తుతం వ్యవసాయ కూలీలకు పని కల్పించే విధంగా ఉపాధి హామీ పనిని, వ్యవసాయానికి అనుసంధానం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక రూపొందిస్తుందని ఆయన అన్నారు. అదేవిధంగా కేంద్రంలో అధికారంలోకి రాగానే దేశం మొత్తం రైతు రుణాలు మాఫీ చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక రూపొందిస్తుందన్నారు. ఖరీఫ్ పంటకు బోనస్ కల్పి స్తామని తెలిపారు. గతంలో అంతర్జాతీయ మార్కె ట్లో క్రూడాయిల్ ధర రూ105 డాలర్లు ఉంటే, అప్పుడు పెట్రోల్ ధర లీటర్ రూ70 రూపాయలు, డిజిల్ రూ50 రూపాయలు ఉండేదన్నారు. ఎన్డీఏ హయాం లో క్రూడాఆయిల్ ధర తగ్గిన, ప్రస్తుతం పెట్రోలు లీటరు 110, డీజిల్ 100 ఉందని అన్నారు. దీంతో రవాణా రంగంపై ఆర్థిక భారం మోపు తుందన్నారు. రైతుకు సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం అందించాల్సి ఉండగా సమాచార హక్కు చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. ఎలక్ట్రోల్ బాండ్స్ ద్వారా బిజెపి కే ఆర్థిక లాభాలు చేకూరిందని ఆరోపించారు. ప్రధాని నెహ్రూ హయాంలో ఎయిర్ ఇండియాను జాతీయం చేసిందని కాని ఎన్డీఏ హయాంలో ప్రభుత్వ రంగాలను కార్పోరేట్ శక్తులకు అప్పగిస్తున్నారని ఆరోపించారు.
ఎన్ఎస్ఎఫ్ ఫ్యాక్టరీలను త్వరలో తెరిపిస్తాం…
జాతీయ స్థాయిలో మార్పు రావాలని రెండు పర్యాయాలు ఎన్డీయే ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకవస్తే, బీజేపీ దేశాన్ని ప్రైవేట్ పరం చేసిందని, రైల్వేలు, రోడ్లు ప్రైవేటీకరణ చేసిందని ఆయన విరుచుకుపడ్డారు. 2001 లో చంద్రబాబు, బీజేపీ అధికారంలో ఉన్న సమయంలో నిజాం షుగర్ ఫ్యాక్టరిని బీజేపీ కి చెందిన ప్రైవేట్ వ్యక్తులకు అమ్మడం జరిగిందన్నారు. 2015 కవిత ఎంపీ గా ఉన్న సమయంలోనే చక్కెర ఫ్యాక్టరీలు మూసి వేయించారని ధ్వజమెత్తారు. రైతు వ్యతిరేక విధానాలు అవలంభించడం వల్లే ఆమె ఓడిపోయిందన్నారు. 2019లో ఎంపీ అరవింద్ అధికారన్ని చేపట్టి పసుపు బోర్డు తీసుకవస్తానని మాయమాటాలు చేప్పి ప్రస్తుతం మళ్లి ఎన్నికలు రావడంతో పసుపు బోర్డుతో పాటు నీజాం షూగర్ ఫ్యాక్టరిని తెరిపిస్తానని హామిలను గుప్తిస్తున్నారని, దీన్ని ప్రజలు ఎవ్వరు నమ్మవద్దని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2025 చివరి నాటికి ఎన్ఎస్ఎఫ్ ఫ్యాక్టరీలను తెరిపిస్తామని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి తెలిపారు. అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో సబ్ కమిటి ఏర్పాటు అయిందని, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో బోధన్, మెట్ పల్లీ షుగర్ ఫ్యాక్టరీలు సందర్శించడం జరిగిందన్నారు. జిల్లాకు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఏమి చేయనందున తాను పార్లమెంట్ ఎన్నికల్లో భారీ విజయం సాధిస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహకార సంఘాల యూనియన్ లిమిటెడ్ చైర్మన్, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తహేర్ బిన్ హందన్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కేశ వేణు, పిసిసి ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్, నగేష్ రెడ్డి, ఎన్.ఎస్.యూ.ఐ అధ్యక్షులు వేణు రాజ్,రత్నాకర్, అంతిరెడ్డీ రాజారెడ్డి, అవెజ్ పాల్గొన్నారు.