ఇఫ్తార్ విందులో పాల్గొన్నా, పేట ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్నిక రెడ్డి,

అక్షర విజేత, మరికల్/ధన్వాడ:
నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలో జామియా మస్జిద్,మరికల్ యందు, డాక్టర్ చిట్టెం పర్నిక రెడ్డి మరియు మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీ చందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ పార్టీ లో పేట ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్నిక రెడ్డి, మరియు మహబూబ్నగర్ జిల్లా,కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి, చల్లా వంశీ చందర్ రెడ్డి, నారాయణపేట జిల్లా ఎలక్షన్ ఇంచార్జ్ అనిల్ కుమార్ సిద్దు మరియు జిల్లా ,డిసిసి అధ్యక్షులు ప్రశాంత్ రెడ్డి లకు, ముస్లిం సోదరులు పూలమాలతొ మరియు శాలువాలతో ఘన సన్మానం చేశారు,ఈ విషయమై వారు మాట్లాడుతూ,ముందుగా ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు, తెలంగాణలో హిందూ-ముస్లిం,గంగా-యమున తహజీబ్,ల కలిసిమెలిసి ఎవరి పండగలను వారు చాలా గొప్పగా జరుపుకోవడం ఇక్కడి సాంప్రదాయం అన్నారు. ఈ కార్యక్రమంలో మరికల్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ,మైనార్టీ ముస్లిం పెద్దలు, యువకులు,తదితర కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.