ఏ.ఐ.పీ.ఎస్.యు నిజామాబాద్ జిల్లాలో ఎలాంటి చేరికలు జరగలేవు
అక్షర విజేత, నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ జిల్లాలో ఏ.ఐ.పీ.ఎస్.యు ఎలాంటి చేరికలు జరగలేదని జిల్లా ప్రధాన కార్యదర్శి జ్వాల ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కమిటీకి సంబంధించినటువంటి ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం జిల్లా సెక్రెటరీ ఎవరైతే గోడ అనిల్ ఉన్నారో, ఆయనను ఎస్ఎఫ్ఐ నుంచి విద్యార్థి సంఘం తొలగించడం జరిగిందన్నారు. అందులో పద్ధతి సరిగా లేదని, అందుకే తొలగించామని ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం వారు చెప్పడం జరిగిందన్నారు. కానీ ఇవన్ని ఏ.ఐ.పీ.ఎస్.యు జిల్లా కమిటీకి తెలుసు, కావున ఏ.ఐ.పీ.ఎస్.యు జిల్లా కమిటీని సంప్రదించకుండా, నాకు సంబంధించి ఎలాంటి అవగాహన లేని సిద్దిపేట జిల్లా కార్యదర్శి అయినటువంటి మన్నే కుమార్ ను సంప్రదించి నిజామాబాద్ జిల్లా కమిటీకి సంబంధం లేకుండా ఏ.ఐ.పీ.ఎస్.యు విద్యార్థి సంఘం లో చేరడం జరిగిందని అన్నారు. కానీ విద్యార్థి సంఘంలో చేరాలంటే జిల్లా కమిటీ ఆమోదం తప్పనిసరి అని, జిల్లా కమిటీ కార్యదర్శి సంబంధం లేకుండా ఎలాంటి చేరికలు జిల్లా కమిటీలో ఉండవనే విషయాన్ని మీడియా మిత్రులు, ఇతర విద్యార్థి సంఘాలు గమనించాలన్నారు. ఆయన వ్యక్తిగత లోపాల వల్ల ఎస్ఎఫ్ఐ లో నుంచి అనిల్ తొలగించడం జరిగిందన్నారు. ఆయనకు ఒక విద్యార్థి సంఘం అనేది లేదని, విద్యార్థి సంఘానికి పనికిరాడని తొలగించిన వ్యక్తిని తిరిగి ఏ.ఐ.పీ.ఎస్.యు లోకి తీసుకుంటాం అనుకోవడం మూర్ఖత్వం అవుతుందన్నారు. సిద్ధిపేట నాయకుల ద్వారా నిజామాబాద్ కు సంబంధంలేని వ్యక్తులతో వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం సరైంది కాదన్నారు. ఈ విషయం తెలుసుకున్న నిజామాబాద్ విద్యార్థి సంఘం జిల్లా కార్యదర్శి జ్వాల ప్రెస్ మీట్ వద్దకు వెళ్లేసరికి ఎక్కడి వాళ్ళు అక్కడ పారిపోవడం జరిగిందన్నారు. మీడియా మిత్రులు, విద్యార్థి సంఘాలు గమనించాలని కోరారు.