మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా నీలం మధు కు టికెట్ కేటాయింపు పట్ల హర్షం
భారీ మెజార్టీతో విజయం తథ్యం
ఉమ్మడి జిల్లా ముదిరాజ్ సంఘం వైస్ ప్రెసిడెంట్ ఎన్ గంగయ్య ముదిరాజ్
అక్షరవిజేత, పాపన్నపేట
మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నీలం మధు ముదిరాజు కు టికెట్ కేటాయించడం పట్ల ఉమ్మడి మెదక్ జిల్లా ముదిరాజ్ సంఘం వైస్ ప్రెసిడెంట్ నిమ్మల గారి గంగయ్య ముదిరాజ్ హర్షం వ్యక్తం చేశారు. బీసీ వర్గానికి చెందిన ముదిరాజ్ బిడ్డ నీలం మదుకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ను కేటాయించిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధిష్టానానికి, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. మెదక్ పార్లమెంట్ ఎన్నికల బరిలో బిజెపి, బిఆర్ఎస్ పక్షాన ఓసి అభ్యర్థులకు టికెట్ కేటాయించగా, కాంగ్రెస్ పార్టీ బీసీ బిడ్డ ముదిరాజ్ నీళ్ల మదుకు టికెట్ కేటాయించడం హర్షించదగ్గ పరిణామం అన్నారు. మెదక్ పార్లమెంట్ పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాలలోని బీసీ ఓటర్లంతా ముక్తకంఠంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మదుకు మద్దతు తెలపాలని, భారీ మెజార్టీతో గెలిపించి తమ సత్తా చాటాలని గంగయ్య ముదిరాజ్ పిలుపునిచ్చారు. మెదక్ పార్లమెంట్ పీఠంపై నీలం ముదిరాజ్ అత్యధిక మెజార్టీతో గెలుపొందడం ఖాయమని గంగయ్య ముదిరాజ్ ధీమా వ్యక్తం చేశారు.