సర్వసభ సమావేశం లో అధ్యక్షతన
వహించిన ఎంపీపీ కరుణ అజయ్ ప్రసాద్
గ్రామంలో నెలకొన్న మౌలిక సదుపాయాలు
అధికారులు అన్ని విధాలుగా ప్రజలకు అందించాలి
అక్షర విజేత, తాండూర్
తాండూర్ నియోజకవర్గం బషీరాబాద్ మండల కేంద్ర కార్యాలయంలో గురువారం అధికారులతో సర్వ సభ సమావేశం
నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ కరుణ అజయ్ ప్రసాద్ మాట్లాడుతూ గ్రామాలలో ప్రజలకు తాగునీరు, పారి శుద్ధ్యం, సమస్య ఉండకుండా చూసుకోవాలని సెక్యూరిటీలకు మరియు ఆఫీసర్లకు చెప్పడం జరిగింది.
అలాగే ప్రత్యేకంగా మూగజీవులకు త్రాగునీరు సమస్య లేకుండా చూడాలని చెప్పడం జరిగింది.
ఉపాధి హామీ కూలి పనులు చేసే వారికి ఎండలు ఎక్కువ ఉండడంవల్ల పలు అధికారులకు ప్రత్యేకంగా సూచించడం జరిగింది .
ఈ కార్యక్రమంలో ఎంపీపీ కరుణ ప్రసాద్,జడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి. ప్రజాప్రతినిధులు మరియు ప్రభుత్వ ఆఫీసర్లు పాల్గొన్నారు