
అక్షర విజేత, శివంపేట
శివంపెట మండల ఆపద్బాంధవుడు సంఘ సేవకులు జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్త ఆధ్వర్యంలో నర్సాపూర్ శాసన సభ్యురాలు వాకిటి సునీత లక్ష్మారెడ్డి జన్మదినం సందర్భంగా శివంపేట మండల కేంద్రంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంతకుముందు ఎమ్మెల్యే వాకిటిసునీత లక్ష్మారెడ్డి సగృహంలో జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా పూల బొకే ఇచ్చి శాలువాతో ఘనంగా సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జడ్పిటిసి పబ్బ మహేష్ గుప్త మాట్లాడుతూ ఎమ్మెల్యేసునీత లక్ష్మారెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో శివంపేట మండల టీఆర్ఎస్ నాయకులు ,కార్యకర్తలు టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు మరియు జెడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా యువసేన సభ్యులు తదితరులు జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు.