చిగురుమామిడి లో మంత్రి పొన్నం ప్రభాకర్ మార్నింగ్ వాక్


అక్షర విజేత: చిగురుమామిడి
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం లో బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఉదయం పూటనె ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి మార్నింగ్ వాక్ పేరుతొ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా చిరు వ్యాపారులతో కలిసి ముచ్చటించారు. స్కూల్ కు వెళ్లే విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.పలువురు గ్రామంలో ఉన్న సమస్యలను తెలుపగా పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు
ఆనంతరం మీడియా తో మాట్లాడుతూ
నియోజకవర్గ ప్రజలకు.తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న.
మీ సమస్యలు ఎం ఉన్నా మీ ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లండన్నారు.
వర్షాకాలంలో సరైన విధంగా వర్షాలు పడని కారణంగా కరువు ఏర్పడిందన్నారు .రైతాంగానికి కొంత ఇబ్బందులు వస్తున్న మాట వాస్తవం. ఐనప్పటికీ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందన్నారు
తాగునీటి సమస్య అసలే లేకుండా ఉండే విధంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందన్నారు.
ఎన్ని నిధులు ఖర్చైనా తాగునీటికి ఇబ్బందులేకుండా గ్రామాల్లో పాత బావులు కిరాయికి తీసుకోవడం , నూతన బోర్లు వేయడం ఏ అంశాలున్నా యుద్ధ ప్రాతిపదికన చేయడానికి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు
గ్రామాల్లో ఉండే సమస్యలు, ఇందిరమ్మ ఇల్లు రాబోయే కాలంలో పరిష్కరించబడతాయనీ తెలియజేశారు .మహిళలు ఆర్టీసీ బసుల్లో ఉచితంగా ప్రయాణం చేస్తున్నారన్నారు.
500 కే గ్యాస్ తో పాటు ,200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నరు . అదే విధంగా ఎన్నో రోజులుగా అర్హత ఉండి లబ్ధి పొందలేకపోతున్నా వారికి
రేషన్ కార్డులు కూడా త్వరలో ఇస్తామన్నారు
రాష్ట్రంలో మా ప్రభుత్వం వీలైనంత వరకు ప్రజా సమస్యలు తీర్చడానికి చర్యలు చేపడుతున్నామన్నారు.
ప్రభుత్వం మంచి పరిపాలన తో మంచి కార్యక్రమాలు తీసుకుంటూ ముందుకు వెళ్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలియజేశారు