నిజాంపేట్ లో కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాలు మాయం చేసిన మేయర్
కాంగ్రెస్ సీనియర్ నాయకులు రామచంద్రనాయక్ ధ్వజం
అక్షర విజేత, కుత్బుల్లాపూర్ :- మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లోని బాచుపల్లి మండలం పరిధిలో ప్రగతి నగర్ నిజాంపేట్ బాచుపల్లి గ్రామ పంచాయతీల నుండి మున్సిపల్ కార్పొరేషన్ 2020 లో ఏర్పడిన తర్వాత మేయర్ భర్త షాడో మేయర్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు సర్వే నెంబర్ 233/ 15, 16, 191, 334, 186 లలో సుమారు రెండువేల కోట్లకు పైగా విలువైన ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకున్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకులు రామచంద్రనాయక్ ఆరోపన.సర్వేనెంబర్ 233/ 15, 16 లో మొన్నటి వరకు ఆ స్థలం కూల్చే వరకు నిద్రపోని మేయర్ భర్త నేడు దగ్గరుండి కబ్జా చేయించడం ప్రభుత్వ జీవో 58, 59 కింద తప్పుడు పత్రాలు సృష్టించి, ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకొని డీల్ 50-50 చేసుకున్నాడని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. బడుగు బలహీన మధ్యతరగతి ఇల్లు లేని నిరుపేద అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తే షాడో మేయర్ భర్త తన బంధువుల పేరిట తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి దాదాపుగా 111 ఇండ్లను తన సొంతం చేసుకున్నాడు. ఇలాంటి నిరుపేదల ఇండ్లు కాజేయడం నిజంగా సిగ్గుచేటు. నిజాంపేట్ లోని ప్రభుత్వ భూముల కబ్జాలపై ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తన భార్య మేయర్ పదవిని అడ్డం పెట్టుకొని ఈ విధంగా ప్రభుత్వ భూములకు కబ్జాలకు దౌర్జన్యాలకు పాల్పడడం గమనార్ధం, మేయర్ తన యొక్క ఆస్తులు కాపాడుకోవడానికె రాజకీయంలో వచ్చారు తప్ప ప్రజాసేవాల్లో ప్రజలకు సేవ చేద్దామనే కనీసం ఆలోచన లేని ఈ మేయర్ కి ఏ ఒక్క పార్టీ లో చోటు కల్పించకూడదని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇటువంటి భూకబ్జాదారులు ప్రజల ఆస్తులు కొట్టే ప్రజల నోళ్లు కొట్టే నాయకులు కాంగ్రెస్ పార్టీలో వస్తే కాంగ్రెస్ పార్టీకే మచ్చ. ఇలాంటి భూ కబ్జాకోరులు అవినీతిపరులను ప్రభుత్వ చట్టపరంగా కేసులు కాకుండా తన యొక్క ఆస్తులు కాపాడుకోవడానికి మాత్రమే కాంగ్రెస్ పార్టీలో చేరాలని చేర్చుకోవాలని తహతహలాడుతున్నారు తప్ప ప్రజల సేవ చేద్దామని ఏమాత్రం కాదని ఇలాంటి నాయకులని పార్టీలో చేర్చుకుంటే పార్టీ నష్టపోవడమే కాకుండా పార్టీ శ్రేణులు కూడా పార్టీని వీడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని రామచంద్రనాయక్ విమర్శిస్తున్నారు . నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడిన మున్సిపల్ మేయర్ అయిన తర్వాత ప్రజల తరఫున ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలు కానీ ప్రజల బాగోగులు చూడని ఇటువంటి షాడో మేయర్ ఈ పార్టీలో వచ్చినంత మాత్రాన ఒరిగేది ఏమీ లేదని ఆయనతో పార్టీ నష్టపోవడం తప్ప పార్టీ నాయకులు కొందరు విడిపోయే ప్రమాదం పొంచి ఉందని రామచంద్రనాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు .
ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రాజమౌలేశ్వర్ , కృష్ణంరాజు, వర్మ రాజు, మధుసూదన్ రెడ్డి, అనంతయ్య, శ్రీశైలం యాదవ్, ఎస్ శ్రీనివాస్, ప్రేమ్ కుమార్, ఎన్ఎంసి మహేష్ కుమార్ ఎస్సీ చైర్మన్, రవికుమార్, మైపాల్ ,ఫన్నీ , దీపక్, మహేష్, పితని శ్రీనివాసరావు,బి రఘు, జంపన్న, శ్రీనివాస్, శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు