బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు.
అక్షర విజేత, మోర్తాడ్
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీంగల్ మండలం చేంగల్ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు బుధవారం రోజున కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జీ ముత్యాల సునీల్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. చేరిన వారిలో వేణుగోపాల్, మహేందర్, రాము, మధు, సురేష్, రాజారామ్, రాములు, సురేందర్ తదితరులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలనకు ఆకర్షితులై నేడు కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి ముత్యాల సునీల్ కుమార్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఆయన చేరిన వారిని కోరారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బోధిరె స్వామి, కుంట రమేష్, జెజె నరసయ్య, రాజు, జీవన్, గ్రామ శాఖ అధ్యక్షుడు రమేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.