వృద్ధ ఆశ్రమాలకు సరైన వసతులు కల్పించడం పట్ల శ్రద్ధ చూపిస్తున్న లయన్స్ క్లబ్ వైరా
అక్షర విజేత వైరా
వృద్ధాశ్రమాలకు సరి అయిన వసతులు కల్పించినట్లయితే వృద్ధాశ్రమంలోని వృద్ధులు సంతోషంగా ప్రశాంతంగా ఉంటారని వారి అవసరాలు తీర్చే విధంగా ప్రతి ఒక్కరు తమకు చేతనైన సహాయం అందించాలని లయన్స్ క్లబ్ వైరా అధ్యక్షులు పెనుగొండ ఉపేంద్ర రావు అన్నారు వైరా మండలంలోని గొల్లపూడి వృద్ధాశ్రమం నందు నూతనంగా నిర్మించిన షెడ్డు నందు ఎండాకాలంలో ఎండ తీవ్రతను తట్టుకునే విధంగా వారి అవసరాన్ని తీర్చే విధంగా కొణతాలపల్లి వెంకట సుజిత్ మౌనిక పెళ్లి రోజున పురస్కరించుకొని రెండు ఫ్యాన్లను ఆశ్రమ నిర్వాహకులకు అందజేస్తూ ఆయన మాట్లాడినారు గతంలో కూడా ఆశ్రమానికి ఇన్వర్టర్ డైనింగ్ టేబుల్స్ చైర్స్ వివిధ రకాలైన మౌలిక వసతులు కల్పించినట్లు ఆయన తెలియజేసినారు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆశ్రమ నిర్వాహకులు మాట్లాడుతూ ఆశ్రమానికి సరైన వసతులు కల్పించడం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్న లయన్స్ క్లబ్ వైరా వారిని అభినందించినారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు పెనుగొండ ఉపేంద్ర రావు మీల్స్ ఆన్ విల్స్ కోఆర్డినేటర్ చింతోజు నాగేశ్వరరావు తాడికొండ రాము ఆశ్రమ నిర్వాహకులు విజయ నరసింహారావు ప్రసాదు తదితరులు పాల్గొని పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేసిన అనంతరం పండ్లు పంపిణీ చేసినారు.