నేడు జరిగే తుక్కుగుడ జన జాతర సభను విజయవంతం చేద్దాం:
జెడ్పి చైర్ పర్సన్ సరిత
అక్షర విజేత జోగులాంబ గద్వాల ప్రతినిధి
నేడు జరగనున్న జన జాతర మహాసభను విజయవంతం చేయాలని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరిత పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆమె పార్టీ శ్రేణులతో కలిసి శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల ప్రణాళిక మేనిపెస్టో తెలంగాణ గడ్డపై సమరశంఖం పూరిస్తూ తుక్కుగుడ రాజీవ్‌గాంధీ ప్రాంగణం వేదికగా జన జాతరకు గద్వాల నియోజకవర్గంలోని పల్లె పల్లె నుంచి పెద్దఎత్తున వేలాదిగా తరలిరావాలని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరిత కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికలను పునరావృతం వేసే విధంగా తుక్కుగుడ సభ ద్వారా ప్రజలకు సందేశం ఇవ్వడమే లక్ష్యంగా సభలో ప్రజా పాలనకు నాంది పలుకుతూ కాబోయే భావి తరాల భారత ప్రధానమంత్రి గా రాహుల్ గాంధీని చేయడమే ఆశయంగా ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త తరలివచ్చి జన జాతర సభ విజయవంతం చేయాలని సరిత కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాఘవీర రెడ్డి,గడ్డం చెన్నకేశవ రెడ్డి, మధుసూదన్ బాబు,డిటిడిసి నర్సింహులు,కౌన్సిలర్లు నరహరి గౌడ్,టి.శ్రీనివాసులు,తుమ్మల నర్సింహులు, భాస్కర్ యాదవ్, లత్తిపురం వెంకట్రామిరెడ్డి,జమ్మిచేడు సురేష్,మాల మహానాడు శ్రీనివాసులు,జగదీష్,కొత్త గణేష్, నంబర్ నర్సింహులు, రాంచందర్,గడ్డం శ్రీను, షాష,గుడ్డెందొడ్డి ఎల్లప్ప తదితరులు ఉన్నారు