హత్నూర మండల తెలంగాణ ఉద్యమ నాయకులు కాంగ్రెస్లో చేరిక
అక్షర విజేత సంగారెడ్డి జిల్లా ప్రతినిధి:
హత్నూర మండలంలో తెలంగాణ పోరాటంలో ముందుండి నడిచిన ఉద్యమకారులు కాంగ్రెస్ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ సాధనలో విరోచిత పోరాటం చేసి తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ ఉద్యమకారులను కేసీఆర్ అంచివేశాడని, ఉద్యమకారులందరూ కాంగ్రెస్లో చేరాలని వారికి తగిన ప్రాధాన్యత కల్పిస్తామని, నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి తో సమావేశమై ఈరోజు రాజిరెడ్డి సమక్షంలో 30 మంది కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారని, టిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు, ఉద్యమకారుల సంఘం మండల ప్రధాన కార్యదర్శి పోట్లచెరువు నరేందర్ ఈ సందర్భంగా తెలియజేశారు. బిఆర్ఎస్ పార్టీ స్వార్ధ రాజకీయాలు, అవినీతి వల్లే ఆ పార్టీ పతనం ఖాయమైందని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, రాష్ట్ర నాయకులు కరుణాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ హత్నూర మండల అధ్యక్షుడు కర్రే కృష్ణ ముదిరాజ్, దౌల్తాబాద్ మాజీ సర్పంచ్ కొన్యాల వెంకటేశం, మారుతి రాజు,హత్నూర మాజీ ఉప సర్పంచ్ సత్యవతి , మండల మైనార్టీ అధ్యక్షుడు అల్తాఫ్ హుస్సేన్, సీనియర్ నాయకులు వల్లి గారి లక్ష్మీనారాయణ, కోణ్యాల సత్యం, నల్లోల్లపెంటయ్య, ఉష్ణగళ్ళ భూమయ్య, వల్లి గారి శీను, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.