ప్రచారంలో దూసుకుపోతున్న కోట్ల సుజాతమ్మ
………… నియోజకవర్గాన్ని అభివృద్ధి పరచడమే తెలుగుదేశం పార్టీ ధ్యేయం
అక్షర విజేత,ప్యాపిలి:
నియోజకవర్గాన్ని అభివృద్ధి పరచడమే తెలుగుదేశం పార్టీ ధ్యేయమని డోన్ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి సతీమణి కోట్ల సుజాతమ్మ అన్నారు. మహిళ, రైతు, యువత, వెనుకబడిన తరగతుల సాధికారత, బలోపేతంతో పాటు ఇతర సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో పేదరికాన్ని నిర్మూలించడం తో పాటు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన తొలి ఏజెండా బాబు షూరిటీ .. భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలోని ఏనుగు మర్రి, మెట్టుపల్లి గ్రామలలో (బాబు సూపర్ 6) మ్యానిఫెస్టో గురించి ప్రజలకు తెలియపరచడానికి, ప్రజలను చైతన్యవంతం చేసి, 2024లో టిడిపి అధికారంలోకి వచ్చాక బాబు సూపర్ 6లోని వాగ్దానాలను ఎటువంటి వివక్ష లేకుండా, అమలుచేయడంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి పాటుపడడానికి చంద్రబాబు నాయుడు కృషి చేస్తారని తెలిపారు.అనంతరం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వై. నాగేశ్వరావ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బాబు సూపర్ 6 పథకాలు అందరికీ అర్థమయ్యే రీతిలో వివరించి, ఇంటింటికి తిరిగి బాబు సూపర్ సిక్స్ మ్యానిఫెస్టో ను వివరించారు. 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి ప్రతి ఒక్కరు సహకరించాలని, నారా చంద్రబాబునాయుడుని ముఖ్యమంత్రిగా చెయ్యాలని, తద్వారా రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ఏనుగుమర్రి రాము, రామకృష్ణ, సూరి గౌడ్, శంకర్, వెంకట రమణ, పగడాల రవి, మెట్టుపల్లె సుదర్శన్, సాంబా, మధుసుదన్ రెడ్డి, వలసల రామకృష్ణ ఆర్ ఈ నాగరాజు, ప్యాపిలి మండల టిడిపి నాయకులు గండికోట రామసుబ్బయ్య, తొప్పేల శ్రీనివాసులు, యర్రగుంటపల్లె వెంకటేశ్వర్ రెడ్డి, బత్తల రమేష్ రెడ్డి,రామ్మోహన్ యాదవ్, ఖాజాపీర్, వెంకటరమణాచారి, నడిగడ్డ నాగేంద్ర, కోదండ రామయ్య యాదవ్, కొంగనపల్లె మధు, ప్రిన్సిపాల్ మధు, పోదొడ్డి కదిరిప్ప, పోదొడ్డి పుల్లారెడ్డి, బీజెపి నాయకులు వడ్డే మహారాజ్, పెదపూదిళ్ళ సంజీవ రెడ్డి, టిడిపి నాయకులు కార్యకర్తలు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.