కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షులు పాముల నారాయణకు పరామర్శ
రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య రాష్ట్ర కమిటీ బృందం భరోసా
50 కేజీల బియ్యం, 20వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేత
అక్షర విజేత ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో:
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలో జాతీయ మానవ హక్కుల కమిటీ కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షులు పాముల నారాయణ తండ్రి చిన్నన్న ఇటీవల మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన జాతీయ మానవ హక్కుల కమిటీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య, రాష్ట్ర కార్యదర్శి తోట రాజయ్య, రాష్ట్ర ప్రచార కార్యదర్శి దుర్గం రఘునాథ్, 5వ జోనల్ కమిటీ కన్వీనర్ రామిండ్ల తిరుపతి, 1వ జోనల్ కో కన్వీనర్ ఇంజం సాంబశివరావు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా సంయుక్త కార్యదర్శి శీలపాక నరేష్ తదితరులు పాల్గొని నారాయణ తండ్రి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా వారి కుటుంబానికి 20వేల రూపాయలు ఆర్థిక సహాయం మరియు 50 కిలోల బియ్యం అందించి భవిష్యత్తులో జాతీయ మానవ హక్కుల కమిటీ రాష్ట్ర కమిటీ తరఫున నారాయణ కుటుంబానికి అండగా ఉంటామని భరోసాను కల్పించారు. ఈ కార్యక్రమంలో కొమరం భీం జిల్లా ప్రధాన కార్యదర్శి చునర్కర్ వెంకట్ మరియు జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.