ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా ఏఐఎస్ఏ విద్యార్థి సంఘంలో చేరిక
అక్షర విజేత, నిజామాబాద్ ప్రతినిధి : విద్యారంగ సమస్య పరిష్కారం కోసం విద్యార్ధి సమరశీల పోరాటాల నిర్మాణానికై పోరాడాలని రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘాన్ని బలోపేతనికి కృషి చేయాలని బుధవారం హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా ఏఐపీఎస్సీ నాయకులను ఏఐఎస్ఏ విద్యార్థి సంఘంలోకి సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి రమేష్ రాజా ఆధ్వర్యంలో ఏఐఎస్ఏ విద్యార్థి సంఘంలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి రమేష్ రాజా మాట్లాడుతూ విద్యా కాషాయీకరణకు వ్యతిరేకంగా నూతన జాతీయ విద్యా విధానం రద్దుకై అదేవిధంగా ప్రభుత్వ విద్యారంగం బలోపేతానికై నిరంతరం పోరాడాలని మొన్న జరిగినటువంటి జేఎన్టియూ ఎన్నికల్లో ఏఐఎస్ఏ విద్యార్థి సంఘం చురుకైన పాత్ర పోషించి జేఎన్టీయూ అధ్యక్షుడిగా ధనుంజయ్ ను ఏఐఎస్ఏ విద్యార్థి సంఘం నుండి ఎన్నిక కావడం జరిగిందని, దేశవ్యాప్తంగా విద్యార్థి ఉద్యమాల్లో ఏఐఎస్ఏ చురుకైన పాత్ర పోషిస్తూ సమరశీల పోరాటాలకు నడుపుతుందని ఇందులో భాగంగానే ఏఐఎస్ఏ విద్యార్థి సంఘంలో చేరిన కామ్రేడ్ కిరణ్, జ్వాల, అపూర్వ, తనుశ్రీ, మేఘన, హర్షిత తదితరులను ఏఐఎస్ఏ విద్యార్థి సంఘములోకీ ఆహ్వానించడం జరిగిందని. కామ్రేడ్ కిరణ్ కు, జ్వాల కు ఏఐఎస్ఏ తెలంగాణ రాష్ట్ర కమిటీ బాధ్యతలను ఇవ్వడం జరిగిందని ఈ సందర్భంగా వారు తెలియజేయడం జరిగింది.