సేవకుడిలా పనిచేస్తా….
మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు
అక్షర విజేత :-
నిత్యం జనంలోనే ఉంటూ ప్రజా సేవకుడిగా పనిచేస్తానని మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ అన్నారు. డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకొని పటాన్చెరు చైతన్య నగర్ కాలనీలో బాబు జగ్జీవన్ రామ్ కమ్యూనిటీ హాల్లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమానికి ఎంపీ అభ్యర్థి నీలం మధు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ.. కాంగ్రెస్ అంటేనే సమానత్వం చూపే పార్టీ అని పేర్కొన్నారు. నాడు ఇందిరా గాంధీ నుంచి మొదలు పెద్దలు జగ్జీవన్ రామ్, అంబేద్కర్ లాంటి మహోన్నతులకు కాంగ్రెస్ గొప్ప అవకాశాలు ఇచ్చి ఆదరించిందని పేర్కొన్నారు. అందరికీ న్యాయం న్యాయం చేయగలిగే పార్టీ ఒకటి ఉందంటే.. అది కాంగ్రెస్ అని అన్నారు. ఈ ప్రాంతం నుంచి గెలిచి ప్రధాని అయినటువంటి ఇందిరా గాంధీ ఇక్కడి ప్రజల కోసం అభివృద్ధి, సంక్షేమం ఎంతగానో కోసం కృషి చేశారన్నారు. ఇందులో భాగంగానే పటాన్చెరు ప్రాంతంలో అనేక ఫ్యాక్టరీలు, కంపెనీలు తీసుకువచ్చి ఎందరికో ఉపాధి అవకాశాలు కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని అన్నారు. ఎంతో నమ్మకంతో తనకు కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ ఇచ్చిందని, తన గెలుపునకు కృషి చేస్తే అందరికీ రుణపడి ఉంటానని అన్నారు. అలాగే కులాలకతీతంగా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూస్తానని కూడా హామీ ఇచ్చారు. కార్యక్రమానికి నాయకులు సమస్యలు దృష్టికి తీసుకురాగా వాటన్నింటినీ పరిష్కరించేందుకు పాటుపడతానన్నారు. ఈ కార్యక్రమంలో INTUC జిల్లా అధ్యక్షులు నరసింహారెడ్డి,రుద్రారం శంకర్, రఘు,యాదయ్య,అనంతయ్య, తదితరులు పాల్గొన్నారు.