అయినా పూర్ గ్రామ శాఖ సమావేశం లో సిపిఎం అభ్యర్థిగా ఎండి జాంగిర్ ను గెలిపించాలి – సీపీఎం సిద్దిపేటజిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి పిలుపు

ఎల్లప్పుడూ ప్రజా సమస్యలే ఎజెండాగా పనిచేసే సిపిఎం అభ్యర్థిని గెలిపించాలి
అక్షర విజేత, కొమురవెల్లి
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండల కేంద్రంలో ఆముదాల మల్లారెడ్డి మాట్లాడుతూ ప్రజల కోసం నిరంతరం పోరాటం చేస్తున్న సిపిఎం పార్టీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి ఎండి జహంగీర్ ను గెలిపించాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి పిలుపునిచ్చారు. ఈరోజు ఐనాపూర్ శాకా సమావేశం పుల్లంపల్లి సాయిలు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో మల్లారెడ్డి మాట్లాడుతూ దేశం అత్యంత క్లిష్ట పరిస్థితులలో ఉన్నదని దేశాన్ని పాలిస్తున్న నరేంద్ర మోడీ బిజెపి ప్రభుత్వం దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందన్నారు. బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న మతోన్మాద కార్పొరేటీకరణ ప్రైవేటీకరణ విధానాలపై నికరంగా పోరాటం చేస్తున్న పార్టీ సిపిఎం పార్టీ అని అన్నారు. పార్లమెంటులో వామపక్షాల బలం తగ్గడంతో గత పది సంవత్సరాల కాలం నుండి కార్పొరేట్ శక్తులు వారికి అనుకూలమైన చట్టాలు పార్లమెంటులో ఆమోదించుకున్నాయని దీనితో దేశంలో ప్రజానికం రైతాంగం కార్మిక వర్గం అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని భారత రాజ్యాంగాన్ని ధ్వంసం చేసే పనిలో బిజెపి ప్రభుత్వం ఉందని అన్నారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉందని అన్నారు. మన దేశాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు పార్లమెంటులో ఎర్రజెండా ఉండాలన్నారు నిరంతరం ప్రజా సమస్యల కోసం పోరాటం చేస్తున్న సిపిఎం పార్టీ అభ్యర్థి ఎండి జాంగిర్ సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటు వేసే బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి చేట్టిపల్లి సత్తిరెడ్డి జిల్లా కమిటీ సభ్యులు బద్దిపడగ కృష్ణారెడ్డి, అత్తిని శారద, తాడూరు రవీందర్, మండల నాయకులు తేలు ఇస్తారి, వుల్లంపల్లి నరసవ్వ, కానుగుల రాజు, సున్నం యాదగిరి, దయ్యాల పోశయ్య, కర్రోళ్ల ఎల్లయ్య, దండు రవి, తేలు నవనీత, మంజుల, కనుకవ్వ, లింగవ్వ, ఇందిరా, బీడీ కార్మికులు హమాలీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.