గ్రామపంచాయతీ వర్కర్లపై ప్రభుత్వం నిర్లక్ష్యం
పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలి
జిల్లా స్థానిక సంస్థల కలెక్టర్ కి వినతి.
ప్రధాన కార్యదర్శి
పి.అరుణ్ కుమార్
అక్షర విజేత వనపర్తి ప్రతినిధి.
వనపర్తి జిల్లా స్థానిక సంస్థల ప్రత్యేక జిల్లా కలెక్టర్ పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ తో కూడుకున్న వినతి పత్రాన్ని అందించారు.
ఈ సందర్భంగా
ప్రధాన కార్యదర్శి
పి.అరుణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా జిల్లాలలో మెజార్టీ గ్రామాల్లో రెండు నుంచి ఐదు నెలల జీతాలు పెండింగ్లో ఉన్నట్టుగా వివిధ గ్రామపంచాయతీలో పనిచేసే కార్మికుల ద్వారా మా దృష్టికి వచ్చింది ఇదే విషయాన్ని జిల్లా కలెక్టర్ కి జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని మండలాల్లో పెండింగ్ జీతాలు లిఖితపూర్వక అందించామని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటవ తేదీన జీతాలు ఇస్తున్న ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మికులకు నెలలు నెలలు పెండింగ్ పెట్టడం భావ్యం కాదని, వాళ్ళ జీతాల కోసం జిల్లా కలెక్టర్ ప్రత్యేక నిధి నుంచి ట్రాన్స్ఫర్ చేసి కార్మికుల జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
కలెక్టర్ స్పందిస్తూ త్వరలోనే పెండింగ్ జీతాలు అన్నిటిని చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు ఏప్రిల్, మే నెలలో ఎండల తీవ్రతంగా ఉండడం వలన ఉదయం 5 గంటల నుంచి 12 గంటల వరకే పని చేయించాలని కలెక్టర్కు విన్నవించగా కచ్చితంగా పంచాయతీ కార్యదర్శులకు చెప్పాలని కోరగా ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 33 కోట్ల రూపాయలు జీతాలు పెండింగ్లో ఉన్నాయి ఇలా ఉంటే కార్మికులు ఏం తిని బతకాలని నాయకుల ఆవేదన వ్యక్తం చేయగా కచ్చితంగా జీతాలు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్న హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఎదుట్ల కురుమయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి బోయిన్పల్లి గణేష్, ఐఎఫ్టియు జిల్లా కోశాధికారి సి.రాజు, వివిధ మండల నాయకులు గోవిందమ్మ, రాజు, గట్టమ్మ, కురుమయ్య, రామచంద్రయ్య ,రాములు, వెంకటయ్య, అలివేల దేవమ్మ, అశోక్* తదితరులు పాల్గొన్నారు