గూడెం గోవింద్ ను పరామర్శించిన: మంత్రి జూపల్లి
అక్షర విజేత చిన్నంబావి
చిన్నంబావి మండలం పరిధిలోని గూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గోవింద్ యాదవ్ గత కొన్ని రోజులుగా గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతూ గత వారం రోజుల నుంచి నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర మంత్రి వర్యులు జూపల్లి కృష్ణారావు నిమ్స్ హాస్పటల్ కి వెళ్లి గూడెం గోవింద యాదవ్ ను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితుల గురించి డాక్టర్ ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పిస్తూ గోవిందు యాదవ్ వైద్య విషయంలో ప్రభుత్వం నుంచి అన్ని విధాల ఆదుకుంటామని వారి కుటుంబ సభ్యులకు రాష్ట్ర మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు హామీ ఇవ్వడం జరిగింది.