నీలం మధుకే సంపూర్ణ మద్దతు
పటాన్ చెరు మాజీ జెడ్పిటిసి మాదిరి జైపాల్
అక్షర విజేత పటాన్చెరు
కాంగ్రెస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ కే తన సంపూర్ణ మద్దతు ఉంటుందని పటాన్ చెరు మాజీ జెడ్పిటిసి మాదిరి జైపాల్ అన్నారు. మెదక్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి నీలం మధు పటాన్ చెరు మాజీ జెడ్పిటిసి మాదిరి జైపాల్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఎంపీ ఎన్నికలలో గెలుపు కోసం తనవంతుగా కృషి చేస్తానని జైపాల్ ఈ సందర్భంగా నీలం మధుకు హామీ ఇచ్చారు. తప్పకుండా గెలిచి పార్లమెంటులో అడుగు పెట్టాలని కూడా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో intuc జిల్లా ప్రెసిడెంట్ నరసింహ రెడ్డి , కౌన్సిలర్ కొల్లూరు మల్లేష్, ప్రతాప్ కృష్ణ, మైనార్టీ నాయకులు మతీన్, ఐలా చైర్మన్ జనార్దన్ రెడ్డి, శ్రీకాకుళం అసోసియేషన్ ప్రెసిడెంట్ అమరేందర్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.