ధన్ పాల్ లక్ష్మి భాయ్, విఠల్ గుప్తా ట్రస్ట్ ద్వారా ఉచిత అంబలి పంపిణీ
అక్షర విజేత, నిజామాబాద్ ప్రతినిధి
నగరంలోని పీఎస్ఎమ్ఎస్ పెట్రోల్ బంక్ ఎదురుగ లలిత రైస్ హౌస్ ప్రాంగణంలో పార్శి రమేష్ షాప్ లో ధన్ పాల్ లక్ష్మి భాయ్, విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుదవారం ఉచిత అంబలి పంపిణీ కేంద్రాన్ని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో కాకుండా, చుట్టూ పక్కన గ్రామాల నుండి నగరానికి వచ్చేవారికి తన ట్రస్ట్ ద్వారా ఉచిత అంబలి వితరణ చేపట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు. జిల్లాలో ఎండల తీవ్రత ఎక్కువ ఉన్నందున వృద్దులు, చిన్న పిల్లలు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అంబలి లాంటి జవా తీసుకోవడం వల్ల ఎండదేబ్బ తగలకుండా ఉండొచ్చాని, తన ట్రస్ట్ ద్వారా ప్రజలకు సేవ చేయడానికి ఎల్లప్పుడూ ముందుంటమని అన్నారు. ఈ కార్యక్రమంలో లలిత రైస్ హౌస్ యజమాని పర్శి రమేష్ గుప్తా, బీజేపీ నాయకులు ఇలందుల ప్రభాకర్ గుప్తా, శివునూరి భాస్కర్ గుప్తా, హరీష్ రెడ్డి, ఆనంద్, గిరిబాబు, పుట్ట విరేందర్, సాయి రామ్, శిలా శ్రీనివాస్, కోడూరు నాగరాజు, నాయకులు తదితరులు పాల్గొన్నారు