కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసిసి ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో చేరిక
అక్షర విజేత, కుత్బుల్లాపూర్ :- కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎఐసిసి ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో పార్టీలో చేరారు. శ్రీశైలం గౌడ్ కు దీపాదాస్ మున్షీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, మైనంపల్లి హనుమంతరావు, పట్నం మహేందర్ రెడ్డి, కుత్బుల్లాపూర్ నాయకులు కొలను హనుమంత్ రెడ్డి, నర్సారెడ్డి భూపతిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.