బిజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రైతు సత్యాగ్రహ దీక్ష


అక్షర విజేత, కొమురవెల్లి:
సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఆర్డీవో ఆఫీస్ ఎదురుగా బిజెపి ధర్నాలో భాగంగా ముఖ్యఅతిథిగా కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందని ప్రకృతి వైపరీత్యంతో నష్టపోయిన రైతులకు ఎకరానికి 25000 చెల్లించాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్లలో ప్రకటించిన 6 గ్యారంటిలలో రైతులకు ఇచ్చిన 2 లక్షల రుణమాఫి, రైతుబరోస కింద 15000, రైతుకులీలకు 12000, రైతు బరోసా వరికి మద్దతు ధర అదనంగా ఇస్తానన్న క్వింటాలుకు 500 బోనస్ వెంటనే అమలు చేయాలని, ఒప్పుకున్న హామీని నిలబెట్టుకోవాలని వ్యవసాయానికి నిరంతర కరెంటు సరఫరా జరగాలని సిద్దిపేట జిల్లా భారతీయ జనతా పార్టీ కోరింది. కొమురవెల్లి మండలం నుండి అసెంబ్లీ కో కన్వీనర్ దండ్యాల లక్ష్మారెడ్డి, బిజెపి మండల అధ్యక్షుడు బూర్గోజు నాగరాజు, కిసాన్ మోర్చా అధ్యక్షుడు జోర్రిగల శరమందారెడ్డి, ప్రధాన కార్యదర్శి కొయ్యడ మల్లేశం గౌడ్, మండల ఉపాధ్యక్షులు వంగ శివారెడ్డి, బ్రాహ్మణుపల్లి బాబు, ఈగ కనకయ్య, మద్దికుంట కరుణాకర్, మండల కార్యదర్శి అక్కెనపల్లి సంపత్ రెడ్డి, సోషల్ మీడియా కాన్వీనర్ పుట్ట కనకయ్య, సీనియర్ నాయకులు దండ్యాల బిక్షపతి రెడ్డి, బచ్చల నరసింహులు, చల్లా రమణారెడ్డి, కొంతం రాజు, చీకోటి సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.