ఆంగ్ల వ్యాకరణంలో మెరిశారు
అక్షరవిజేత,రెంటచింతల
ఆంగ్ల భాష ప్రాధాన్యం పెరుగుతున్న క్రమంలో ఆంగ్ల వ్యాకరణం తర్ఫీదుతో భాషా నైపుణ్యాలు మెరుగు పరుస్తూ,విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీయడంతో పాటు, కమ్మనైన తెలుగు భాషపై ఆసక్తిని కనపరిచేలా ప్రోత్సహిస్తున్నట్లు ఫాతిమా విద్యానికేతన్ ప్రిన్సిపల్ కె.శౌరి స్టెఫీ స్టార్ అన్నారు. బుధవారం స్థానిక ఫాతిమా విద్యానికేతన్ పాఠశాలలో జరిగిన ప్రీస్కూల్ గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో యూకేజీ నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులు పాల్గొని ఆంగ్ల వ్యాకరణలో తమ ప్రతిభను ప్రదర్శించారు.ప్రదర్శనలో మూడో తరగతి విద్యార్థినులు నందిని,రితికల ఆంగ్ల వ్యాకరణం చూసి అందరూ అచ్చెరువు చెందారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిర్దిష్ట వ్యాకరణలపై దృష్టి సారించేలా రోజువారి పఠనం వారిని వ్యాకరణ వినియోగానికి గురిచేస్తుందన్నారు.వ్యాక్య నిర్మాణంపై వారి అవగాహన పెంచడమే కాకుండా ఆంగ్ల వ్యాకరణ వారి నైపుణ్యాలను మెరుగుపరుస్తుందన్నారు. ఆంగ్ల భాషా పరిజ్ఞానంలో దిట్టలుగా తయారు చేయడమే తమ విద్యా నికేతన్ లక్ష్యమని ఆమె తెలిపారు.ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి.