ప్రభుత్వ పాఠశాల అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి
ప్రముఖ వైద్యులు డాక్టర్ శ్రీనివాసరెడ్డి
అక్షర విజేత వైరా:
ప్రభుత్వ పాఠశాలలో అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ప్రస్తుతం రాష్ట్రస్థాయిలో వివిధ ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి వారు ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని నాణ్యమైన విద్యను అభ్యసించి మంచి జ్ఞానాన్ని ఆర్జించారని లయన్స్ క్లబ్ వైరా అధ్యక్షులు పెనుగొండ ఉపేంద్ర రావు అన్నారు. వైరా మండలం ఖానాపురం ప్రాథమికోన్నత పాఠశాల యందు పాఠశాల ప్రధానోపాధ్యాయులు గంజినబోయిన రామకృష్ణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వైరా ప్రముఖ వైద్యులు డాక్టర్ శ్రీనివాసరెడ్డి పుట్టినరోజు సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు గంజినబోయిన రామకృష్ణ అభ్యర్థన మేరకు పాఠశాలకు మైక్ సెట్ బహూకరిస్తున్న సందర్భంగా ఆయన పాల్గొని మాట్లాడినారు డాక్టర్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఖానాపురం గ్రామానికి నా చిన్ననాటి నుండి ఎంతో అనుబంధం ఉందని మా తండ్రి వెంకట్ రెడ్డి గారు ఈ గ్రామానికి ఎన్నో రకాలుగా సేవలు అందించారని ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులు అంటే తనకు ఎంతో ఇష్టమని వారి అభివృద్ధికి తాను సహకరిస్తానని తల్లిదండ్రులు కూడా పిల్లల చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని నేటి తరానికి ఆస్తులు ఇవ్వలేకపోయినప్పటికిని వారిని ఉన్నత చదువులు చదివించడంతో వారి అభివృద్ధికి భావి భారత నిర్మాతలు అవుతారని ఆయన తెలియజేసినారు
ఈ కార్యక్రమంలో క్లబ్ కోశాధికారి చింతలపూడి వెంకటేశ్వరరావు బాధ్యులు తాటికొండ రాము ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు ఎస్కే జరీనా, బి.రాము వి బిక్షరావు గ్రామస్తులు షేక్ మౌలాలి షేక్ ఖాదర్ బాబా, షేక్ హీన తోట నాగమణి తాజుద్దీన్ తల్లితండ్రులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన అనంతరం ఉపాధ్యాయులు, గ్రామస్తులు డాక్టర్ శ్రీనివాసరెడ్డిని ఘనంగా సన్మానించినారు.