ప్రతి ఒక్కరూ భక్తి భావంతో ఉండాలి
— శిరసనగండ్ల లో కోళ్ల ఫారం ప్రారంభోత్సవం
— ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న
మాజీ ఎమ్మెల్యే
అక్షరవిజేత,చారకొండ:
ప్రతి ఒక్కరు స్వయంకృషితో ఆర్థికంగా ఎదగాలని అచ్చంపేట మాజీ శాసనసభ్యులు డాక్టర్ గువ్వల బాలరాజ్ అన్నారు.బుధవారం శిరసనగండ్లలో మాజీ ఉప సర్పంచ్ పసుల శ్రీను కు చెందిన కోళ్ల ఫారం,వారి కూతురు పుట్టిన రోజు కార్యక్రమంలో పాల్గొన్న గువ్వల బాలరాజు.అనంతరం శాంతి గూడెం గ్రామంలో అభయ ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ట బ్రహ్మోత్సవాలు మూడవ రోజున స్వామివారిని దర్శించుకున్నారు.అనంతరం బాలరాజ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భక్తి భావంతో మెలగాలని,భక్తి భావంతో ఉంటే స్వామివారి ఆశీస్సులు ఉంటాయని అన్నారు.ప్రతి ఒక్కరూ ఏదో ఒక స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదగాలని,శ్వాసక్తితో ముందు సాగాలని అలా ఆర్థికంగా ఎదుగుతనే సమాజం గుర్తిస్తుందని ఈ సందర్భంగా అన్నారు.ఈ కార్యక్రమంలో కోళ్ల ఫారం యజమాని పసుల శ్రీను,పార్టీ నాయకులు,గ్రామస్తులు,బిఆర్ఎస్ పార్టీ యువజన అధ్యక్షుడు చండీశ్వర్,మాజీ సర్పంచ్ అని శెట్టి శ్రీను,బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.