18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి.
అదనపు కలెక్టర్ అపూర్వ చౌహన్
అక్షర విజేత జోగులాంబ గద్వాల ప్రతినిధి
18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడు ఓటు హక్కు దరఖాస్తు చేసుకొని, ఓటును సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) అపూర్వ చౌహాన్ అన్నారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మంగళవారం జిల్లా కేంద్రంలోని కృష్ణవేణి చౌరస్తా నుండి పాత బస్టాండ్ వరకు నిర్వహించిన 5 కే రన్ కార్యక్రమాన్ని జిల్లా అదనపు కలెక్టర్ జండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఓటు నమోదు చేసుకొన్నా ప్రతి ఓటరు ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించు కోవాలని, ప్రజలలో చైతన్యం కలిగించేందుకు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఐ ఓట్ ఫర్ షూర్ అనే నినాదంతో 5కే రన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో పౌరులందరికీ సమాన ఓటు హక్కును కల్పించడం జరిగిందన్నారు. జాతి, కులం, మతం ఆధారంగా కాకుండా అభివృద్ధి, ప్రగతి ప్రాతిపదికన పనిచేసే ప్రభుత్వాలను ఎన్నుకోవడానికి ఓటు హక్కు గొప్ప అవకాశం అని చెప్పారు. జిల్లాలో ఓటింగ్ శాతం పెరిగేలా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ముఖ్యంగా కళాశాలలో చదువుకునే విద్యార్థిని విద్యార్థులు ఏప్రిల్ 15 వరకు ఫామ్ – 6 ద్వారా తమ పేరును ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని సూచించారు. జిల్లాలో స్వీప్ కార్యక్రమాలు నిర్వహించి ప్రతి ఒక్కరిని ఓటర్ గా నమోదు చేయించేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. విద్యాసంస్థల్లోనూ ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం వలన విద్యార్థులు తమ తల్లిదండ్రులకు ఓటు ప్రాధాన్యతను వివరించే వీలుపడుతుందన్నారు. ఏప్రిల్ ఒకటి నాటికి 18 సంవత్సరాల నిండిన వారందరూ మే మూడవ తేదీ వరకు ఓటు హక్కును వినియోగించుకునేలా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉందన్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కొత్త ఓటర్లు, ముఖ్యంగా యువత ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్నారు .
అనంతరం పాత బస్టాండ్ లో జిల్లా అధికారులు, బి.ఎల్.ఓలు, మున్సిపల్ సిబ్బందితో ఓటు హక్కు వినియోగించుకుంటామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రాంచందర్, స్వీప్ నోడల్ అధికారి రమేష్ బాబు, గద్వాల తహశీల్దారు వెంకటేశ్వర్లు, డి.ఆర్.డి.ఓ నర్సింగరావు, మున్సిపల్ కమిషనర్ శంకర్ సింగ్, జిల్లా వ్యవసాయ అధికారి గోవిందు నాయక్, బీసీ, ఎస్సీ సంక్షేమ అధికారిణి శ్వేత ప్రియదర్శిని, డివైఎస్ఓ ఆనంద్, ఇతర అధికారులు, యువత, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.