Monday, April 21, 2025
spot_img

సైబర్ నేరాలు నియంత్రణకు పోలీస్ శాఖ కృషి

సైబర్ నేరాలు నియంత్రణకు పోలీస్ శాఖ కృషి
సైబర్ నేరాలు నియంత్రణకు పోలీస్ శాఖ కృషి

సైబర్ నేరాలు నియంత్రణకు పోలీస్ శాఖ కృషి

అక్షర విజేత సిద్దిపేట్

ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్, అదనపు డి.జి.పి. షికాగోయల్ ఐపీఎస్ ఆదేశానుసారం ప్రతి పోలీసు స్టేషన్ లలో సైబర్ వారియర్స్ కు ప్రత్యేక ఫోన్స్, సిమ్స్ అందించడం జరిగింది.
పెరిగిపోతున్న టెక్నాలజీకి తగ్గట్టుగానే దేశవ్యాప్తంగా సైబర్‌ నేరాలు విజృంభిస్తున్న నేపథ్యంలో జిల్లాలో సైబర్‌ క్రైమ్‌ యూనిట్‌ ఏర్పాటు చేస్తున్నట్లు, తద్వారా సైబర్ నేరాల నియంత్రణకు పోలీస్‌ శాఖ సైబర్ నేరాల నియంత్రణ కోసం సైబర్ నేర బాదితులకు మెరిగైన సేవలు అందించాలని సూచించారు.
జిల్లాలో జరిగే సైబర్‌ నేరాలను ఏక్కడికక్కడే నియంత్రించేందుకు పోలీస్ స్టేషన్ వారీగా ఈ విభాగాలు కృషి చేస్తాయని తెలిపారు.
సైబర్ కేసుల్లో పూర్తి స్థాయి ఆధారాలు సేకరించి నేరస్ధులను గుర్తించటం, నేరగాళ్లకు శిక్ష పడేలా చేయడం, బాధితులకు న్యాయం చేయడం అనేది సైబర్ వారియర్స్ చాలేంజ్ గా తీసుకొవాలన్నారు.
పోలీస్‌ శాఖలో నియమితులై పూర్తి స్థాయిలో టెక్నాలజీపై పట్టున్న సిబ్బందిని సైబర్‌ నేరాల నియంత్రణకు ఉపయోగించి ప్రజలకు త్వరితగతిన సేవలించేలా ఈ సైబర్ వారియర్స్ ని తయారు చేసినామని తెలిపారు.
ఈ సైబర్ వారియర్స్ సైబర్ ఆర్దిక నేరాలు, కంప్యూటర్ వైరస్, ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ, సైబర్‌ సెక్యూరిటీ చాలెంజెస్, రిస్క్‌ అండ్‌ మేనేజ్‌మెంట్, నేషనల్‌ సైబర్‌ సెక్యూరిటీ పాలసీ యాక్ట్, కమ్యూనికేషన్‌ వ్యవస్థ, ఇంటర్‌నెట్‌ డేటా సెంటర్, నెట్‌ వర్కింగ్‌ వ్యవస్థ, నేషనల్‌ నాలెడ్జ్‌ నెట్‌వర్క్, ఇన్ఫర్మేషన్‌ ఆడిటింగ్‌ కంప్లైన్స్, ఐవోటీ, క్లిష్టమైన వెబ్‌ అప్లికేషన్స్, సెక్యూరిటీ రిస్క్స్, మొబైల్‌ అప్లికేషన్స్ సెక్యూరిటీ, సోషల్‌ మీడియా ఇన్‌ ఈ గవర్నెన్స్, ఇన్సిడెంట్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ తదితరాలపై శిక్షణ ఇచ్చినామని అన్నారు. జిల్లా పరిధిలో 26 మంది సిబ్బందిని సైబర్ క్రైమ్ నేరాలను పరిష్కరించేందుకు కేటాయించినట్లు పోలీస్ కమిషనర్ మేడం గారు తెలిపారు.
సైబర్ నేరాలకు గురైన వ్యక్తులు 1930 కి కాల్ చేసి గాని, ఎన్సిఆర్పి పోర్టల్ ద్వారా గాని ఫిర్యాదు నమోదు చేసుకున్న అనంతరం వారి యొక్క అప్లికేషన్ స్టేటస్ ను తెలుసుకోవడానికి తిరిగి 1930 కాల్ చేసిన వెంబడే తమ ఏరియా లో గల సైబర్ వారియర్ కు సులువుగా ఫోన్ కనెక్ట్ అయి తమ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవడానికి వీలుంటుందని అన్నారు. జిల్లా ప్రజలు ఈ సేవలను వినియోగించుకోవాల్ని పోలీస్ కమిషనర్ మేడం గారు సూచించారు.
ఈ కార్యక్రమంలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఎసిపి శ్రీనివాస్, ఇన్స్పెక్టర్ శేఖర్, సైబర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది రాము, హరీష్, సైబర్ వారియర్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పోలీస్ స్టేషన్ ల వారీగా సైబర్ వారియర్స్ ఫోన్ నంబర్స్
సిద్దిపేట రూరల్/ 8712657665,
సిద్దిపేట 3 టౌన్/ 8712657666,
గౌరారం/ 8712657667, తొగుట/ 8712657668, రాజగోపాలపేట/ 8712657669,
మర్కుక్/ 8712657760, సిద్దిపేట 2 టౌన్ / 8712657761,
సిద్దిపేట 1 టౌన్/ 8712657762,
కొమురవెల్లి/ 8712657763, రాయపోల్/ 8712657764, అక్కన్నపేట/ 8712657765, మద్దూర్/ 8712657766, చేర్యాల/ 8712657767, భూంపల్లి/ 8712657768, కుకునూరుపల్లి/ 8712657769,
మిరుదొడ్డి/ 8712657770, ములుగు/ 8712657771, జగదేవపూర్/ 8712657772,
బేగంపేట/ 8712657773, గజ్వేల్/ 8712657774, దౌల్తాబాద్/ 8712657775, దుబ్బాక/ 8712657776, చిన్నకోడూర్/ 8712657778, కోహెడ/ 8712657779, హుస్నాబాద్/ 8712657780,
బెజ్జంకి/8712657781.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles