బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలి
.జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్
అక్షరవిజేత మహబూబాబాద్
ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో పోలింగ్ అధికారుల పాత్ర కీలకం బాధ్యతాయుతంగా నిబద్ధతతో పిఓ,ఏపిఓ,ఓపిఓలు ఎన్నికల నిబంధనల ప్రకారం విధులు నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు.మంగళవారం జిల్లా కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో ప్రిసైడింగ్,సహాయ ప్రిసైడింగ్ అధికారులు చేయవలసిన విధులపై మాస్టర్ ట్రైనర్స్ చే నిర్వహించిన2వ రోజు శిక్షణా కార్యక్రమంలో జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ పాల్గొని వారికి పిపిటి ద్వారా శిక్షణా తరగతుల గురించి అవగాహన కల్పించారు.కార్యక్రమంలో ఓటింగ్ ప్రారంభం లో తీసుకోవలసిన జాగ్రత్తలు మాక్ పోలింగ్ నిర్వహించే విధానం లో జాగ్రత్తలు తీసుకోవాలని అలాగే సంభందిత పోలింగ్ అధికారులు ఫామ్22ను క్లుప్తంగా ఒకటికి10సార్లు చదివి తప్పులు లేకుండా సరిచూసుకోవాలని అన్నారు.ట్రైనింగ్ పొందే అధికారులు సందేహం ఉన్నట్లయితే వారికి మరొకసారి అవగాహన కల్పిస్తామని జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు.ఈ కార్యక్రమంలో ఉప ఎన్నికల అధికారి,అదనపు కలెక్టర్ రెవెన్యూ డేవిడ్,మాస్టర్ ట్రైనర్లు రాము,ప్రెసైడింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.