వాహనాల తనిఖీలలో ఎస్సై మోహన్ రెడ్డి లక్ష రూపాయల నగదు పట్టివేత
అక్షర విజేత జుక్కల్ ప్రతినిధి
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని అయ్యప్ప గుడి వద్ద ఎస్సై మోహన్ రెడ్డి విస్తృతంగా వాహనాల తనకీ నిర్వహించారు. ఇందులో భాగంగా ద్విచక్ర వాహనంపై వస్తున్న మహిళ నుండి లక్ష రూపాయల నగదు స్వాధీనం చేసుకొని సీజ్ చేసినట్టు పేర్కొన్నారు.నగదు తీసుకొస్తున్న మహిళపై కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ అనుమతులు లేకుండా అక్రమంగా నగదు మద్యం తరలిస్తే కఠిన చర్యలు తీసుకొని కేసు నమోదు చేస్తామని తెలిపారు. ఎన్నికల కోడ్ అమరులో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు నియమ నిబంధనలు పాటించాలని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.